Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రీతువర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని అమల కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. సెప్టెంబర్ 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ ను మొదలుపెట్టేసింది. తాజాగా సినిమాలో కీలక పాత్రలు పోషించిన వెన్నెల కిషోర్, ప్రియదర్శి తో పాటు శర్వానంద్, రీతూ వర్మ ఫన్నీ ఇంటర్వ్యూను నిర్వహించారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో శర్వానంద్ తన చిన్ననాటి స్నేహితుల గురించి చెప్పుకొచ్చాడు. స్టార్ హీరోలు రానా, రామ్ చరణ్, శర్వానంద్ క్లాస్ మేట్స్ అన్న విషయం తెల్సిందే. స్కూల్ లో లీడర్స్ ఉండేవారు కదా.. మీకు ఎవరు ఉండేవారు అన్న ప్రశ్నకు శర్వా మాట్లాడుతూ “మేము చదువుకున్నప్పుడు క్లాస్ లీడర్ పెట్టడాలు లేవు.. ఒకవేళ ఉన్నా తెలియలేదేమో మాకు. అసలు క్లాసులో ఉంటేనే గా మాకు తెలిసేది. మా మీద ఫిర్యాదులు ఇచ్చేవాళ్ళంని మేము తొక్కేసేవాళ్ళం. నేనే రౌడీ బాయ్ అనుకుంటే నాకన్నా రౌడీ బాయ్స్ ఇంకా ఉన్నారు. రానా, రామ్ చరణ్.. చాలా పెద్ద స్టూడెంట్స్ వాళ్లు. ఒక్క హైట్ విషయంలోనే కాదు అన్నింటిలోనూ వాళ్ళు చాలా బ్రైట్ స్టూడెంట్స్. మళ్లీ మేము అందరం ట్యూషన్ కూడా వెళ్లేవాళ్లం. అక్కడ కూడా ఇదే పని. ఇంగ్లీష్ కు ట్యూషన్ చెప్పించుకున్నది నేనే. నేను ట్యూషన్ తో బాగుపడతాను అని పాపం మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. వాళ్లకి అది కూడా తెలియలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
