Site icon NTV Telugu

Jawan: ప్రీవ్యూకే ఇలా అయితే ఎలా… ట్రైలర్ వస్తుంది కాస్కోండి

Jawan

Jawan

పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి బాయ్ కాట్ ట్రెండ్ కి, బాలీవుడ్ బాక్సాఫీస్ స్లంప్ ని ఎండ్ కార్డ్ వేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. జనవరి 25న సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్, హిందీ సినిమాకి ప్రాణం పోసాడు. ఇప్పుడు సెప్టెంబర్ 7న మరో బాక్సాఫీస్ సెన్సేషన్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ సినిమా షారుఖ్ కే కాదు బాలీవుడ్ కే బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. అనౌన్స్మెంట్ నుంచే హైప్ మైంటైన్ చేస్తున్న జవాన్ మూవీ, రీసెంట్ గా ప్రీవ్యూతో అందరికీ మైండ్ బ్లాక్ చేసింది. గుండు గెటప్ లో షారుఖ్ చేసిన హంగామా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. రిలీజ్ అయిన 24 గంటల్లో జవాన్ ప్రీవ్యూ 112 మిలియన్ వ్యూస్ రాబట్టింది అంటే ఆ వీడియో సృష్టించిన హవోక్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. యాక్షన్ ప్యాక్డ్ ప్రీవ్యూ షారుఖ్ ఫాన్స్ కి మాత్రమే కాదు ప్రతి యాక్షన్ మూవీ లవర్ కి కిక్ ఇచ్చింది.

అనిరుద్ మ్యూజిక్ ప్రీవ్యూని మరింత స్పెషల్ గా మార్చింది. చాలా రేర్ గా షారుఖ్ నెగటివ్ టచ్ ఉన్న రోల్ ప్లే చేస్తాడు, ఒకసారి ప్లే చేస్తే మాత్రం దాని ఇంపాక్ట్ బాక్సాఫీస్ దగ్గర బాగా బలంగా ఉంటుంది. ఈ విషయాన్నే జవాన్ ప్రీవ్యూ మరోసారి నిరూపించింది. ప్రీవ్యూకే ఇలా అయిపోతే ఎలా, జవాన్ ట్రైలర్ వస్తుంది అంటుంది బాలీవుడ్ మీడియా. సెప్టెంబర్ 7న జవాన్ రిలీజ్ షెడ్యూల్ అయ్యి ఉంది కాబట్టి ఆ లోపు ఇంకో ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అవుతుంది, ఇప్పుడు రిలీజ్ అయిన దానికన్నా యాక్షన్ ప్యాక్డ్ గా ఆ వీడియో ఉండబోతుందని బీటౌన్ టాక్. ఇదే నిజమైతే జవాన్ సినిమా బిజినెస్ అండ్ కలెక్షన్స్ విషయంలో భారీగా లెక్కలు మారే అవకాశం ఉంది. మరి సెప్టెంబర్ 7న షారుఖ్ మరోసారి వెయ్యి కోట్ల సినిమా ఇస్తాడేమో చూడాలి.

Exit mobile version