Pataan: యాబై రోజుల్లో బాలీవుడ్ ని తాకనున్న ‘షారుఖ్ సునామీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఖాన్ గా, ఇండియన్ బాక్సాఫీస్ బాద్షాగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరో ‘షారుఖ్ ఖాన్’. మూడు దశాబ్దాలుగా ‘ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా పేరు తెచ్చుకున్న షారుఖ్, గత కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్నాడు. అయిదేళ్లుగా షారుఖ్ హీరోగా నటించిన ఒక్కటి కూడా రిలీజ్ కాలేదంటే, షారుఖ్ ఎలాంటి ఫేజ్ లో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఫ్లాప్ స్ట్రీక్ వచ్చి డౌన్ ఫేజ్ లో షారుఖ్ ఖాన్ టైం అయిపొయింది అనే విమర్శలు వినిపించడం మొదలయ్యింది. ఇలాంటి సమయంలో షారుఖ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతూ చేస్తున్న సినిమా ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో 50వ సినిమాగా రూపొందిన ఈ స్పై యాక్షన్ సినిమా జనవరి 25న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్తున్న ఈ మూవీపై సినీ అభిమానుల్లో ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. ‘పఠాన్’ సినిమాతో షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూపిస్తాడని షారుఖ్ ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
పోస్టర్స్ తోనే హీట్ పెంచుతున్న ‘పఠాన్’ సినిమా రిలీజ్ కి ఇంకా యాబై రోజులు ఉన్న సంధర్భంగా, షారుఖ్ ఫాన్స్ #YRF50 అనే ట్రెండ్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంకో యాబై రోజుల్లో ‘పఠాన్’ మీ ముందుకి వస్తున్నాడు అంటూ మేకర్స్ కొత్త పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. షారుఖ్ గన్ను పట్టుకోని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో దీపిక పదుకొణే హీరోయిన్ గా నటిస్తుండగా, జాన్ అబ్రహం విలన్ గా కనిపించనున్నాడు. ఎనిమిడ్ దేశాల్లో షూటింగ్ జర్పుకున్న ‘పఠాన్’ మూవీతో షారుఖ్ తన ఫ్లాప్ స్ట్రీక్ కే కాదు బాలీవుడ్ కష్టాలకి కూడా ఎండ్ వర్డ్ వేయడం గ్యారెంటి అనే కాన్ఫిడెన్స్ లో బీ-టౌన్ వర్గాలు ఉన్నాయి. ‘పఠాన్’ సినిమాపై ఇప్పుడున్న హైప్ కి, కాస్త పాజిటివ్ టాక్ తోడైతే చాలు షారుఖ్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read
- Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన 'రాజా శివాజీ'.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
- Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో 'కల్కి 2' భారీ సర్ప్రైజ్!
- Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
- Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
తాజావార్తలు
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్‌బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!