Site icon NTV Telugu

Sharathulu Varthisthai: ఉమెన్స్ డే స్పెషల్.. ఆకాశం అందనీ సాంగ్ రిలీజ్ చేసిన సీతక్క

Boomi

Boomi

Sharathulu Varthisthai చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. ఈ సినిమా మార్చి 15వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఆకాశం అందనీ.. లిరికల్ సాంగ్ ను మంత్రి సీతక్క చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ‘ఆకాశం అందనీ..’ పాటకు చైతన్య పింగళి లిరిక్స్ అందించగా..నరేష్ అయ్యర్, నయన నాయర్ పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ చిలువేరు కంపోజ్ చేశారు. ‘ఆకాశం అందనీ, నేలైనా పొందనీ, ఆటేదో ఆడితే ఇంతేనుగా మరి శూన్యాలే ఈసడి, బంధాలే ఓ ముడి, మందల్లే మారునా, ఆపేయునా కన్నీళ్లనీ..’ అంటూ ఎమోషనల్ గా సాగుతుందీ పాట.

ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ” తరతరాలుగా మహిళ ఈ సమాజంలో అణిచివేతకు గురవుతోంది. వారికంటూ ఉన్న ప్రత్యేకమైన రోజు ఈ ప్రపంచ మహిళా దినోత్సవం. మహిళలు పోరాడి సాధించుకున్న ఈ రోజున మహిళా గీత రచయిత చైతన్య పింగళి రాసిన ‘ఆకాశం అందనీ..’ లిరికల్ సాంగ్ ను నా చేతుల మీదుగా రిలీజ్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మధ్య తరగతి మనుషుల జీవితాలను ప్రతిబింబించే సినిమా ష‌ర‌తులు వ‌ర్తిసాయి. మన గ్రామాల్లో నివసించే మధ్య తరగతి మనుషుల జీవితాల్లోని కథలు, వెతలు, భావోద్వేగాలన్నీ ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమా హీరో చైతన్య, ఇతర నటీనటులకు, దర్శకుడు కుమారస్వామి, మామిడి హరికృష్ణ, లిరిసిస్ట్ చైతన్య పింగళి…అందరికీ నా శుభాకాంక్షలు. ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ “మా ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమాలోని ‘ఆకాశం అందనీ..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన మంత్రి సీతక్క గారికి కృతజ్ఞతలు. సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ష‌ర‌తులు వ‌ర్తిసాయి కరీంనగర్ నేపథ్యంగా సాగే సినిమా అయినా ఇందులోని ఎమోషన్స్ యూనివర్సల్ గా ప్రేక్షకులు అందరికీ నచ్చుతాయి. కుమారస్వామి కొత్త దర్శకుడైనా సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఈ నెల 15న రిలీజ్ అవుతున్న మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నానని” అన్నారు.

దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ..”మంత్రి సీతక్క గారు ఎంతో బిజీగా ఉన్నా మా ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమాలోని ‘ఆకాశం అందనీ..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆమెకు మా టీమ్ తరుపున కృతజ్ఞతలు చెబుతున్నాం. ఈ పాట మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఈ నెల 15న థియేటర్స్ లోకి ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమా రిలీజ్ కు వస్తోంది. మీరంతా చూసి రెస్పాన్స్ తెలియజేస్తారని ఆశిస్తున్నానని” అన్నారు

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ .. “మంత్రి సీతక్క గారు మా సినిమా టీమ్ ను బ్లెస్ చేయడం హ్యాపీగా ఉంది. మా ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమాలోని ‘ఆకాశం అందనీ..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మరికొద్ది రోజుల్లోనే మా సినిమా మీ ముందుకు రాబోతోంది. ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమా అన్ని కమర్షియల్ అంశాలు ఉంటూనే రియలిస్టిక్ మేకింగ్ తో ఆకట్టుకుంటుందని” అన్నారు.

Exit mobile version