Shanmukh Jaswanth Debuting as Hero in etvwin’s upcoming web film: సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్ జష్వంత్ కొంతకాలం క్రితం గంజాయి కేసులో అరెస్టయి సంచలనానికి కారణమైన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక అయితే ఎట్టకేలకు ఆయన ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మెయిన్ లీడ్గా వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ చేసిన షణ్ముఖ్ జశ్వంత్ పూర్తిస్థాయిలో సినిమాల్లో నటించలేదు. అయితే ఏకంగా ఆయన ఇప్పుడు ఒక వెబ్ ఫిలింలో హీరోగా నటిస్తుండగా ఆ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ ఈరోజు ఘనంగా జరిగింది.
Balakrishna: ఇది కదా బాండింగ్ అంటే.. చెల్లెలిని ఆత్మీయంగా ముద్దాడిన బాలయ్య
షణ్ముఖ్ జస్వంత్ హీరోగా అనఘా అజిత్ హీరోయిన్గా పవన్ కుమార్ అనే దర్శకుడు ఈటీవీ విన్ కోసం ఒక వెబ్ ఫిలిం డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాని శ్రీ అఖియన్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ స్క్రిప్ట్ అందించారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన లాంచింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన మొదటి షాట్ ని సుబ్బు డైరెక్ట్ చేయగా బేకింగ్ వేణుగోపాల్ క్లాప్ ఇచ్చారు.