శంకర్ షణ్ముగం 90ల్లో ఈ దర్శకుడు పేరు ఒక సంచలనం, శంకర్ తో సినిమా అంటే సూపర్ హిట్ గ్యారంటి, నిర్మాతలకు లాభాలే లాభాలు. నిర్మాతలు, హీరోలు శంకర్ తో సినిమా చేసేందుకు క్యూ కట్టేవారు. అది అప్పట్లో శంకర్ రేంజ్, జెంటిల్ మెన్, జీన్స్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, బాయ్స్,శివాజీ అబ్బో ఒకటేమిటి ప్రతిసినిమా వేటికవే బ్లాక్ బస్టర్. రజనితో తీసిన రోబో అయితే ఇండియన్ స్క్రీన్ పై ఒక సంచలనం.
Also Read: Venu Yeldandi: బలగం దర్శకుడి కథలో బలం లేదా.?
కానీ అదంతా గతం. రోబో తర్వాత శంకర్ ప్రభ మసక బారింది. స్నేహితుడుతో మొదలైన శంకర్ డౌన్ ఫాల్ భారతీయుడు -2 వరకు పడుతూనే ఉంది. ఓడలు బళ్ళు,బళ్ళు ఓడలు అవుతాయి అనేదానికి శంకర్ చక్కటి ఉదాహరణ. ఇప్పుడు శంకర్ తో సినిమా అంటే నిర్మాతలు కుదేలైపోవాల్సిదే. శంకర్ దర్శకత్వంలో శివాజీ సినిమా చేసిన AVM స్టూడియోస్ ఆ సినిమా నష్టాల దెబ్బకు సినిమాలు తీయడం మానేసి, సీరియల్స్, షాట్ ఫిల్మ్స్ చేసుకుంటుంది. ఇక విక్రమ్, శంకర్ ల ‘ఐ’ నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్ ఆ ఒక్క సినిమా ఫ్లాప్ తో అప్పుల్లో కూరుకుపోయారు. విజయ్ తో చేసిన స్నేహితుడు దాటికి జెమినీ ఫిల్మ్స్ జెండా ఎత్తేసారు. ఇక శంకర్ తో రోబో 2.O, భారతీయుడు -2 సినిమాలు చేసిన లైకా ప్రొడక్షన్స్ గురించి చెప్పక్కర్లేదు. శంకర్ తో సినిమాలు చేసి అటుఇటుగా 500 కోట్ల రూపాయలు నష్టపోయారు లైకా. అనవసరపు ఆర్భాటాలు, కథ, కథనం లోపించడం, భారీ సెట్లుతో భారీగా ఖర్చు చేయడం రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అవడంతో నిర్మాతలు ఆర్థికంగ మునిగిపోయారు. ప్రస్తుతం శంకర్ చేస్తున్న గేమ్ ఛేంజెర్ పరిస్థితో ఏంటో రాబోయే రెండు నెలల్లో తేలుతుంది.