Site icon NTV Telugu

Shankar: #GameChanger క్లైమాక్స్ కంప్లీట్… నెక్స్ట్ సిల్వర్ బుల్లెట్ సీక్వెన్స్

Shankar

Shankar

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. భారి బడ్జట్ తో, శంకర్ మార్క్ సోషల్ కాజ్ టచ్ తో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఎలక్ట్రిఫయ్యింగ్ క్లైమాక్స్’ కంప్లీట్ అయ్యింది అంటూ శంకర్ ట్వీట్ చేశాడు. ఇటివలే ఈ క్లైమాక్స్ ని శంకర్ హ్యూజ్ స్కేల్ లో షూట్ చెయ్యడం స్టార్ట్ చేశాడు. ఆడియన్స్ కి ఒక కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి శంకర్, గేమ్ చేంజర్ క్లైమాక్స్ ని మోకోబోట్ కెమెరాలో షూట్ చేశాడు. విక్రమ్, బీస్ట్, తునివు సినిమాలకి కూడా ఈ కెమెరాని వాడారు. హై స్పీడ్ విజువల్స్ ని క్యాప్చర్ చెయ్యడంలో మోకోబోట్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంటుంది.

రామ్ చరణ్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్న గేమ్ చేంజర్ సినిమా వచ్చే సమ్మర్ కి రిలీజ్ చెయ్యడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. ఇక గేమ్ చేంజర్ క్లైమాక్స్ కంప్లీట్ చేసిన శంకర్, గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ఇండియన్ 2కి షిఫ్ట్ అయిపోయాడు. ఈరోజు నుంచి ఇండియన్ 2 షూటింగ్ లోకి వెళ్లిపోతున్నాడు శంకర్. ఇండియన్ 2 సినిమాకి సంబంధించిన సిల్వర్ బుల్లెట్ సీక్వెన్స్ ని షూట్ చెయ్యబోతున్నాడు శంకర్ ట్వీట్ లో మెన్షన్ చేశాడు. ఒక పెద్ద ప్రాబ్లమ్ ని షూర్ షాట్ గా సింపుల్ సొల్యుషన్ ఇచ్చే దాన్ని సిల్వర్ బుల్లెట్ అని అర్ధం వస్తుంది. మరి ఆ పెద్ద ప్రాబ్లమ్ ఏంటి? దానికి శంకర్ ఇవ్వబోయే సిల్వర్ బుల్లెట్ సీక్వెన్స్ ఏంటి? అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Exit mobile version