కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కి రఫ్ఫాడిస్తుంది. మిడ్ వీక్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు 129 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. 2023లో సెకండ్ హయ్యెస్ట్ ఓపెనింగ్ ఫిల్మ్ గా జవాన్ నిలిచింది. మొదటి ప్లేస్ లో ఆదిపురుష్ సినిమా ఉంది. జవాన్ మూవీకి నార్త్ బెల్ట్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, సౌత్ లో హిట్ టాక్ ఉంది కానీ మనకి అలవాటు అయిపోయిన ఫక్తు కమర్షియల్ డ్రామా కావడంతో రెగ్యులర్ ఫీల్ రావడం గ్యారెంటీ. అయితే ఒక తమిళ దర్శకుడు, తమిళ హీరోనే, తమిళ విలన్, తమిళ మ్యూజిక్ డైరెక్టర్, తమిళ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఉన్న జవాన్ సినిమాకి… తమిళనాడులో కన్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్స్ వస్తుండడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో జవాన్ సినిమా ఇప్పటివరకున్న అన్ని బాలీవుడ్ సినిమాల రికార్డులని బ్రేక్ చేసింది.
పది కోట్లు రాబట్టిన జవాన్ సినిమా స్ట్రాంగ్ వీకెండ్ కి టార్గెట్ చేస్తుంది. మండే స్టార్ట్ అయ్యే సమయానికి జవాన్ మూవీ ఇప్పుడున్న కలెక్షన్స్ కన్నా డబుల్ రాబట్టడం పక్కా. తమిళనాడులో జవాన్ సినిమా పర్వాలేదులే అనిపించేలా కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇక్కడ నయనతార, అనిరుద్, విజయ్ సేతుపతి, అట్లీలకి ఉన్న ఇమేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా జవాన్ సినిమా కలెక్షన్స్ ని పెంచలేకపోయింది. తమిళ్ కన్నా తెలుగులో కలెక్షన్స్ ఎక్కువ ఉండడంతో… హిందీ హీరో, తమిళ కాస్ట్ అండ్ క్రూ అయినా కూడా మేము సినిమా చూసి ఆదరిస్తాం, అది మాకు సినిమాపై ఉన్న ప్రేమ… అందుకే వరల్డ్ లో మాకంటే గొప్ప సినిమా ప్రేమికులు ఉండరు అంటూ కొందరు తెలుగు యూత్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.