బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇచ్చాడు. అది కూడా అట్టాంటి ఇట్టాంటి కంబ్యాక్ కాదు. బాక్సాఫీస్ దగ్గర కోట్ల సునామిని తీసుకొచ్చాడు. ఇక షారుఖ్ పనైపోయింది అనుకుంటున్న సమయంలో… పఠాన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కింగ్ ఖాన్. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు జవాన్‌తో మరో వెయ్యి కోట్లు ఇచ్చేశాడు షారుఖ్. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది. డే వన్ నుంచే భారీ వసూళ్లను రాబడుతోంది ఈ సినిమా. కేవలం హిందీలోనే 430 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. కేవలం 11 రోజుల్లోనే ఈ మార్క్ టచ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది జవాన్. ఇక వరల్డ్ వైడ్‌గా 850 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రేపో మాపో 900 కోట్ల మార్క్ టచ్ చేయనుంది.
దీంతో అత్యంత వేగంగా 800 కోట్లు రాబట్టిన బాలీవుడ్ మూవీగా జవాన్ రికార్డు సాధించింది. ఇక థర్డ్ వీక్‌లో జవాన్ వెయ్యి కోట్లు రాబట్టి.. సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ. ఈ వీక్‌లో పెద్ద సినిమాలేవి రిలీజ్ కావడం లేదు పైగా వినాయక చవితి సెలవులు కూడా ఉండడంతో… వెయ్యి కోట్ల వైపు దూసుకుపోతోంది జవాన్. అంతేకాదు.. లాంగ్ రన్‌లో జవాన్ మరింత వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఈ ఏడాదిలో రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా షారుఖ్ హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు. ఇదే కాదు… మరో వెయ్యి కోట్ల సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్ట్ చేస్తున్న ‘డంకీ’ సినిమా డిసెంబర్ 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా కూడా వెయ్యి కోట్లు రాబడితే.. ఒకే ఏడాదిలో మూడు వేల కోట్లు ఇచ్చిన హీరోగా, షారుఖ్ క్రియేట్ చేసిన రికార్డ్‌ను టచ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు.
