NTV Telugu Site icon

Jawan: రెండు రోజుల్లో 240 కోట్లు… కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్

Jawan

Jawan

పదేళ్లుగా హిట్ లేదు… అయిదేళ్లుగా సినిమానే లేదు ఇక షారుఖ్ ఖాన్ పని అయిపొయింది అని బాలీవుడ్ మొత్తం డిసైడ్ అయ్యింది… ఒక షారుఖ్ ఖాన్ తప్ప. టైమ్ అయిపోవడం ఏంటి, నేను హిందీ సినిమాకి కింగ్ అని ప్రూవ్ చేస్తూ షారుఖ్ ఖాన్ డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. ఫిలిం హిస్టరీలో ఇప్పటివరకూ చూడని కంబ్యాక్ ని ఇచ్చిన షారుఖ్ ఖాన్, ఒకే ఇయర్ లో రెండు హిట్స్ కొట్టాడు. ముందుగా జనవరిలో పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన షారుఖ్ ఖాన్, ఇప్పుడు జవాన్ సినిమాతో పఠాన్ రికార్డులని బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మొదటి రోజు 129 కోట్లు రాబట్టిన జవాన్… రెండో రోజు 110 కోట్లకి పైగా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

Read Also: Pawan Kalyan: చంద్రబాబు అరెస్ట్‌పై ఇలా స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. వాటికి సంపూర్ణ మద్దతు..

ఓవరాల్ ఫైనల్ ఫిగర్ ఇంకా రాలేదు కానీ ఎర్లీ ఎస్టిమేట్స్ ప్రకారం జవాన్ సినిమా రెండు రోజుల్లో 240 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇది బాలీవుడ్ హిస్టరీలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ అనే చెప్పాలి. ఈరోజే వీకెండ్ స్టార్ట్ అయ్యింది, సండే ఇంకా బాలన్స్ ఉంది కాబట్టి జవాన్ సినిమా డే 3 అండ్ 4 కలెక్షన్స్ డే 1 రీచ్ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే జవాన్ మూవీ ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యే సరికి 500 కోట్ల బెంచ్ మార్క్ ని బ్రేక్ చేయడం గ్యారెంటీ. పఠాన్ సినిమాతో 25 రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టిన షారుక్ జవాన్ సినిమాతో ఆ వెయ్యి కోట్ల మార్క్ ని ఎన్ని రోజుల్లో రీచ్ అవుతాడు అనేది ఇప్పుడు బీటౌన్ లో జరుగుతున్న హాట్ డిస్కషన్.

Show comments