Site icon NTV Telugu

Shahid Kapoor: సల్మాన్ డైరెక్టర్ తో షాహిద్ సినిమా… త్వరలో టీజర్

Shahid Kapoor

Shahid Kapoor

అథ్లెటిక్ పర్సనాలిటీ, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ కలిసిన యాక్టర్ గా పేరు తెచ్చుకున్న హీరో ‘షాహిద్ కపూర్’. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న షాహిద్ కపూర్, ఇటివలే ఒటీటీలోకి డెబ్యు ఇస్తూ ‘ఫర్జీ’ వెబ్ సీరీస్ తో ఆడియన్స్ ని పలకరించాడు. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సీరీస్ ఇండియాలోనే హయ్యెస్ట్ వ్యూవర్షిప్ తెచ్చిన వెబ్ సీరీస్ గా పేరు తెచ్చుకుంది అంటే షాహిద్ కపూర్ ఒటీటీలోకి ఎలాంటి ఎంట్రీ ఇచ్చాడో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక షాహిద్ సినిమాల విషయానికి వస్తే, ఇటివలే కృతి సనన్ హీరోయిన్ గా ఒక లవ్ స్టొరీ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసిన షాహిద్ కపూర్ తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశాడు. సల్మాన్ ఖాన్ తో ‘టైగర్ జిందా హై’ లాంటి హై వోల్టేజ్ స్పై యాక్షన్ సినిమా చేసిన ‘అలీ అబ్బాస్ జాఫర్’ దర్శకత్వంలో షాహిద్ కపూర్ కొత్త సినిమా అనౌన్స్ అయ్యింది.

మేరి బ్రదర్ కీ దుల్హన్, గూండే, సుల్తాన్ లాంటి సినిమాలతో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న అలీ అబ్బాస్ జాఫర్, షాహిద్ ని కూడా కంప్లీట్ కొత్తగా చూపించడానికి రెడీ అయ్యాడు. ఈ కాంబినేషన్ లో ‘బ్లడీ డాడీ’ అనే సినిమా అనౌన్స్ అయ్యింది. ఫస్ట్ లుక్ లో షాహిద్ కపూర్, సూటు వేసుకోని రక్తం మరకలతో వయోలేంట్ గా కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో షాహిద్ కపూర్ ఇంత ‘రా’గా కనిపించలేదు. తన మార్క్ ని చూపిస్తూ అలీ అబ్బాస్ జాఫర్, షాహిద్ కపూర్ ని కొత్త ప్రెజెంట్ చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ ని ఆడియన్స్ లో క్రియేట్ చెయ్యడంలో ఫస్ట్ లుక్ పోస్టర్ తన వంతు రోల్ ప్లే చేసింది. మరి టీజర్ డ్రాపింగ్ సూన్ అంటున్న ‘బ్లడీ డాడీ’ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Exit mobile version