Site icon NTV Telugu

Shah Rukh Khan : “బీస్ట్”కు పెద్ద ఫ్యాన్ అట !!

Shah Rukh Khan

Shah Rukh Khan

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాను కోలీవుడ్ స్టార్ విజయ్ కు అభిమానిని అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. “బీస్ట్” హిందీ ట్రైలర్‌ను ఆవిష్కరిస్తూ దళపతి విజయ్ అభిమానులను షారుఖ్ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ చిత్రం ఏప్రిల్ 13న పలు భాషల్లో గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉండగా, ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా షారుఖ్ “అట్లీతో కలిసి కూర్చున్నాను. విజయ్ కి అట్లీ ఎంత పెద్ద అభిమానో నేను కూడా అంతే పెద్ద అభిమానిని. “బీస్ట్” టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ట్రైలర్ స్ట్రాంగ్ గా ఉంది!!” అంటూ ట్వీట్ చేశారు. “బీస్ట్” నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ . ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, సెల్వరాఘవన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలు పోషించారు. యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, VTV గణేష్, అపర్ణా దాస్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ “బీస్ట్”కు మ్యూజిక్ అందించారు.

Read Also : RC15 : నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్స్ ఏంటంటే ?

కాగా షారుఖ్, అట్లీ కలిసి “లయన్” అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు షారుఖ్ ఖాన్… సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పఠాన్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. “పఠాన్‌”ను పూర్తి చేసిన తర్వాత అట్లీ “లయన్‌”ను తిరిగి ప్రారంభించనున్నాడు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version