స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో దేశ వ్యాప్తంగా తన సత్తాను చాటుకున్నాడు. దాంతో ఆ సినిమా సీక్వెల్ కోసం అందరూ ఆతృతతో ఎదురుచూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మల్లూవూడ్ లోనూ గట్టి ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ మొదటి నుండీ సోషల్ మీడియాలో తనదైన ముద్రను వేస్తూనే ఉన్నాడు. ఇన్ స్ట్రగ్రామ్ లో అల్లు అర్జున్ కు ఏకంగా 18.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా… ఇప్పుడు ట్విట్టర్ లోనూ నిదానంగా దూకుడు పెంచాడు. అతని ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్న వారి సంఖ్య తాజాగా ఏడు మిలియన్స్ దాటింది. ఈ విషయాన్ని స్వయంగా బన్ని తెలియచేస్తూ, ‘మీ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఫాలోవర్స్ కు విషెస్ తెలిపాడు. కేవలం తన సినిమాలకు సంబంధించిన వివరాలనే మాత్రమే కాకుండా అల్లు అర్జున్… తన ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను, పిల్లలకు సంబంధించిన ఈవెంట్స్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో అతన్ని ఫాలో అయ్యే వారి సంఖ్య డే బై డే పెరిగిపోతూ ఉంది. మరి ఎ.ఎ. అంటూ తనకంటూ ఓ సొంత బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్… ఇంకెంతమంది ఫాలోవర్స్ ను తన వైపు తిప్పుకుంటాడో చూడాలి
7M … Thank you for all the love 🖤 pic.twitter.com/WMW8wrygWc
— Allu Arjun (@alluarjun) August 17, 2022
