NTV Telugu Site icon

Tiger Nageswara Rao : 5 ఎకరాల్లో భారీ సెట్… కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు

Tiger Nageswara Rao

Tiger Nageswara Rao

మాస్ మహారాజ రవితేజ మొదటి పాన్-ఇండియా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు”. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైమ్ డ్రామాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ మోడల్ గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఆమెతో పాటు బాలీవుడ్ దివా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా మరో కథానాయికగా నటిస్తోంది. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఒక సెట్ కోసం ఏకంగా కోట్లు కుమ్మరిస్తున్నారట మేకర్స్.

Read Also : Bigg Boss Non Stop : ఈ వారం కమెడియన్ అవుట్

‘టైగర్ నాగేశ్వరరావు’ షూటింగ్ కోసం సుమారు రూ. 7 కోట్లతో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. గతంలో ‘మహానటి’, ‘జెర్సీ’, ‘ఎవరు’, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి అనేక సూపర్‌హిట్ చిత్రాలకు పని చేసిన ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ప్రస్తుతం ఈ సినిమా కోసం డెబ్బైల కాలం నాటి స్టువర్ట్‌పురంను తలపించే భారీ సెట్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఏడు కోట్ల విలువైన ఈ సెట్‌ను శంషాబాద్ సమీపంలో ఐదెకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పేరుమోసిన దొంగపై తెరకెక్కుతున్న ఈ బయోపిక్ డెబ్బైల నాటి స్టువర్టుపురం అనే గ్రామంలో జరుగుతుంది. సినిమాలో రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండనున్నాయి.