టాలీవుడ్ బుల్లితెర నటి లహరిపై కేసు నమోదయ్యింది. మంగళవారం రాత్రి ఆమె తన కారులో వెళ్తూ ముందు వెళ్తున్న బైక్ ని ఢీకొన్నది.. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని లహరిని, కారును పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్లితెర నటి లహరి మంగళవారం అర్ధరాత్రి శంషాబాద్ రోడ్డు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వెళ్తోన్న బైక్ ని ఢీకొన్నది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని హాస్పిటల్ కి తరలించారు. ఆ సమయంలో డ్రైవింగ్ సీట్ లో లహరి కూర్చొని ఉందని, ఆమె ఘటన జరిగిన తరువాత లహరి కారు నుంచి బయటకు దిగలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఆమె మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లహరిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
