టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. శుక్రవారం సొంత ఊరు నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నాగేశ్వరరావు మరణం గురించి ఆయన కుమారుడు మాట్లాడుతూ ఫిట్స్ కారణంగా తన తండ్రి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు. నాగేశ్వర రావుకి కుమారుడు, కూతురు భార్య ఉన్నారు. దర్శకుడు మరణ వార్త విని టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
Read Also : జయసుధ షాకింగ్ మేకోవర్… పిక్ వైరల్
నిన్న హైదరాబాద్ కి వస్తున్న క్రమంలో కోదాడ సమీపంలోకి రాగానే నాగేశ్వర రావు కి ఫిట్స్ వచ్చాయని, దాంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. అక్కడ రెండు, మూడు ఆసుపత్రులకు తరలించినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి ఏలూరు లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కానీ సమయానికి వైద్యం అందకపోవడంతో అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దర్శకుడు నాగేశ్వరరావు మృతదేహాన్ని వాళ్ళ అత్తగారి నివాసమైన కవులూరు గ్రామంలో ఉంచారు. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు నాగేశ్వరరావు కుమారుడు వెల్లడించారు.
https://www.facebook.com/veerasanker/posts/10220719895176267
1986 నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్న ఆయన స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అసిస్టెంట్ గా ఇండస్ట్రీలో కెరీర్ ను ప్రారంభించారు. ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగేశ్వరరావు ఆ తర్వాత శ్రీహరిని పరిచయం చేస్తూ ‘పోలీస్’ అనే సినిమా చేశారు. రెండు సినిమాలు మంచి హిట్ అవడంతో ఆ తర్వాత వరుసగా ‘శ్రీశైలం’, ‘సాంబయ్య’, ‘దేశద్రోహి’ వంటి సినిమాలను తెరకెక్కించారు. ఇటీవలే వాళ్ళ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ చదలవాడ శ్రీనివాసరావు నిర్మాణంలో ఓ సినిమాను ప్రారంభించారు. కానీ ఆ మూవీ ఇంకా పూర్తి కాకముందే ఆయన అనారోగ్యంతో హఠాన్మరణం పాలవ్వడం బాధాకరం.
