Tabu: కూలీ నెం 1 చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది టబు. ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఇక్కడ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన అమ్మడు బాలీవుడ్ లో ఇప్పటికీ తన స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవిస్తూనే ఉంది. ఇటీవలే తెలుగులో అల వైకుంఠపురం చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన టబు ప్రస్తుతం హిందీలో కార్తీ ఖైదీ చిత్రం రీమేక్ భోళా లో నటిస్తోంది. ఇక ఆమె వయసు 50 ఏళ్ళు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఈ విషయమై ప్రతి ఇంటర్వ్యూ లో ఆమె సమాధానం చెప్పుకొస్తూనే ఉంటుంది. అయితే తాజాగా తన పెళ్లి ప్రశ్నకు ఆమె కొద్దిగా ఘాటుగానే స్పందించింది.
వయస్సు అవుతోంది.. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? పిల్లలను ఎప్పుడు కంటారు..? అన్న ప్రశ్నకు టబు బోల్డ్ సమాధానం ఇచ్చింది. “పిల్లలను కనడానికి పెళ్లి చేసుకోవాలా..? ఇప్పుడు ఎన్నో సరోగసి పద్ధతులు వచ్చాయి. దాని ద్వారా కూడా పిల్లలను కనొచ్చు. దానికోసం పెళ్లి చేసుకోవాలా..?. పెళ్లి కాకపోతే చచ్చిపోతామా..? పిల్లల్ని కనకపోతే చచ్చిపోతామా..? అలా జరగదు కదా. మరి ఎందుకు ఇలాంటి ప్రశ్నలు. ప్రస్తుతం నా యాక్టింగ్ కెరీర్ ను నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా మనసుకు నచ్చినవాడు ఇంకా దొరకలేదు. నన్ను అర్ధం చేసుకొని నాతో ఉండాలి అనుకున్నవాడు వస్తే అప్పుడు తప్పకుండ పెళ్లి చేసుకుంటా” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టబు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
