Site icon NTV Telugu

Sekhar Master: ‘రాజంపేట రాణి’ లిరికల్ సాంగ్ లాంచ్ చేసిన శేఖర్ మాస్టర్

Sekhar Master

Sekhar Master

సాయికుమార్‌, ఆదిత్యా ఓం, ఐశ్వర్య రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ సాయి, దీపాలి రాజపుత్‌ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని రాజంపేట రాణిని అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని శేఖర్ మాస్టర్ విడుదల చేసారు. సత్య కశ్యప్ సంగీతం అందించారు. శాంతి స్వరూప్ సాహిత్యం అందించిన ఈ పాటను గీతామాధురి ఆలపించారు.

శేఖర్‌ మాస్టర్‌ మాట్లాడుతూ ‘‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌గా శాంతి కుమార్‌ అందిరికీ పరిచయమే. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి సినివుమా దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. ఈ చిత్రంలోని ‘రాజంపేట రాణిని’ అంటూ సాగే మాస్‌ బీట్‌ పాటను చూశా. సంగీతం, కొరియోగ్రఫీ చాలా బావుంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. జబర్దస్త్‌ నుంచి వెళ్లిన వేణు ‘బలగం’ చిత్రంతో పెద్ద పేరు తెచ్చుకున్నాడు శాంతి కుమార్‌ మంచి గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

శాంతికుమార్‌ మాట్లాడుతూ ‘‘జబర్దస్త్‌ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు , పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. శేఖర్ మాస్టర్ ఈ మాస్ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

Exit mobile version