Sekhar Master fires on Anchor Siva at Dhee Celebrity Special: యాంకర్ శివ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు యూట్యూబ్ లో వివాదాస్పద వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి క్రేజ్ తెచ్చుకుని బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 లో పాల్గొని చాలా కాలం పాటు హౌస్ లో కొనసాగాడు. ఇక తరువాత బిగ్ బాస్ సీజన్ 6 బజ్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించాడు. ఇక యాంకర్ శివ ఇప్పుడు డీ సెలబ్రిటీ స్పెషల్ లాంచింగ్ ఎపిసోడ్ లో మెరిశాడు. మనోడు డ్యాన్స్ చేస్తున్నాడో లేక యాంకర్ గా ఉన్న నందుతో కలిసి యాంకరింగ్ చేస్తున్నాడో తెలియదు కానీ శేఖర్ మాస్టర్ తో పరాచికాలు ఆడబోయి ఆయనకు కోపం తెప్పించాడు.
యాంకర్ శివ మాట్లాడుతూ మీకు ఒక హీరోయిన్ కి ఎఫైర్ ఉందని ప్రచారం ఉంది కదా అని ప్రశ్నించగా దానికి శేఖర్ మాస్టర్ సీరియస్ అయ్యాడు. వెంటనే అసలు ఇతన్ని ఎవరు రానిచ్చారు? నువ్ వెళ్తావా? నన్ను వెళ్ళిపోమంటావా? అంటూ సీరియస్ అయ్యాడు. ఇక ఇది నిజమో లేక ప్రోమో కోసం కట్ చేశారో చూడాలి. ఢీ సెలబ్రిటీ స్పెషల్ షో ఆడియన్స్ ముందుకు త్వరలోనే రానుంది. ఇక ఈ షో అంతా కొత్త కొత్తగా అనిపిస్తోంది ఎందుకంటే పాత వాళ్లంతా ఈ షోకి బైబై చెప్పేయగా ఈ ఢీ సీజన్ 17 కి యాంకర్ గా నందు ఎంట్రీ ఇచ్చాడు. అలాగే జడ్జెస్ లో శేఖర్ మాష్టర్ మాత్రమే ఉండగా ఇక లేడీ జడ్జి ఉన్న పూర్ణ ప్లేస్ లో కన్నడ నటి అత్తారింటికి దారేది సెకండ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ ని తీసుకొచ్చారు.