Site icon NTV Telugu

ఆ డైలాగ్‌తో ఇన్‌స్పైర్‌ అయ్యి ‘లవ్ స్టోరి’ తీశాను: శేఖర్ కమ్ముల

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ.. సెప్టెంబరు 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకని చిత్రబృందం ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కి బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌తో కలిసి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరైయ్యారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘అమీర్ ఖాన్ ను అభిమానించే వాళ్లలో నేనూ ఒకర్ని. ఆయన సినిమా ఖయామత్ తే ఖయామత్ తక్ చూసినప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అమీర్ ఖాన్ ఇలా గన్ పట్టుకుని డిఫరెంట్ సినిమా ఎలా చేయగలిగాడు అని ఆశ్చర్యపోయాను. నేను డాలర్ డ్రీమ్స్ సినిమా చేసి, దానికి నేషనల్ అవార్డ్ పొందాను. ఆ తర్వాత దిల్ చాహతా హై రిలీజైంది. అక్కడా యువత డ్రీమ్స్ కనిపిస్తాయి. ఎక్కడో మా సినిమాలకు తెలియని కనెక్షన్ ఉంది అనిపించింది. సర్ఫరోష్ సినిమా దర్శకుడు నాకు తెలిసిన మిత్రుడే. ఆయన మీకు కథ చెప్పి ఒప్పించి సినిమా చేశాడు. నేనూ ఒకరోజు మీకు కథ చెబుతాననే నమ్మకం కలిగింది. త్రీ ఇడియట్స్ చూశాక, నేను రూపొందించిన హ్యాపీడేస్ కు రిలేటివ్ గా అనిపించింది. అప్పుడు మీ సినిమాలకు నా సినిమాలకు ఎక్కడో తెలియని కనెక్షన్ ఏర్పడుతోంది అని భావించాను.

అమీర్ ఖాన్ హోస్ట్ చేసిన సత్యమేవ జయతే కార్యక్రమం చూశాక.. మీలా మరే స్టార్ సొసైటీ కోసం ఆలోచించలేరు అనిపించింది. భగవంతుడే మిమ్మల్ని ఇలా పని చేయిస్తున్నాడు అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే గర్వంగా అనిపిస్తుంటుంది. నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను. సినిమాలకు ఏదో ఒక పర్పస్ ఉండాలని కోరుకుంటాను. సొసైటీకి ఏదో ఒక మంచి చెప్పాలనుకుంటాను. లీడర్ సినిమాలో నేనో డైలాగ్ రాశాను. అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కుల వివక్ష ఉందని. ఆ డైలాగ్ నుంచి ఇన్ స్పైర్ అయి లవ్ స్టోరి చిత్రాన్ని తెరకెక్కించాను. లవ్ స్టోరి షూటింగ్ టైమ్ లో ఫస్ట్ వేవ్, రిలీజ్ టైమ్ లో సెకండ్ వేవ్ వచ్చాయి. ఈ కష్టంలోనూ మా సినిమా టీమ్ అంతా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. వాళ్లందరికీ నా థాంక్స్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా చిత్రాన్ని థియేటర్ లోనే విడుదల చేయాలని నిర్ణయించిన నారాయణదాస్ నారంగ్ గారికి కృతజ్ఞతలు. లవ్ స్టోరి చిత్రాన్ని థియేటర్ లో చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది..’ అన్నారు.

https://youtu.be/g1AO7udVWvo
Exit mobile version