NTV Telugu Site icon

అన్ని రకాల షేడ్స్‌తో.. దుమ్మురేపిన ‘లవ్ స్టోరీ’ ట్రైలర్

యంగ్ టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సాయిపల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా లవ్ స్టోరీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సన్నివేశాలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. శేఖర్ కమ్ముల మార్క్ సినిమా అయినప్పటికీ ట్రైలర్ మాత్రం చాలా ఫ్రెష్ గా మలిచారు. సాధారణంగా ప్రేమకథ చిత్రాలు చూడ్డానికి యూత్ ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే శేఖర్ కమ్ముల లాంటి సినిమా ట్రైలర్ కోసం మాత్రం ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు.

ఇక ట్రైలర్ గనుకను ఓసారి చూస్తే.. రేవంత్, మౌనిక పాత్రలు ఆకట్టుకొనేలా వున్నాయి. మరి ముఖ్యగా అన్నిరకాల భావోద్యేగాలు, హావభావాలతో ట్రైలర్ డిఫరెంట్ గా సాగింది. లైఫ్‌‌లో సెటిల్ కావడం కోసం ఇటు మిడిల్ క్లాస్ కుర్రాడు (రేవంత్) నాగ చైతన్య, అటు (మౌనిక) సాయిపల్లవి పడే కష్టాలు చాలా సహజంగా చూపించారు. ఆ తర్వాత ఆ ఇద్దరి లవ్ ట్రాక్ ను శేఖర్ కమ్ముల తనదైన మార్క్ సినిమా ట్రైలర్ గా చూపించారు. సక్సెస్ కోసం చైతూ పడే తపన ఈ సినిమాలో ప్రధానాంశం కానుందని ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. మరి ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

#LoveStory Theatrical Trailer | Naga Chaitanya | Sai Pallavi | Sekhar Kammula | Pawan Ch