Site icon NTV Telugu

Dhanush Nagarjuna: పాన్ ఇండియా సినిమా మొదలుపెట్టిన శేఖర్ కమ్ముల…

Dhanush Nagarjuna

Dhanush Nagarjuna

ఈ సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ సినిమాతో ధనుష్ సాలిడ్ హిట్ కొట్టాడు. 75 కోట్ల కలెక్షన్స్ ని వారం రోజుల్లోనే రాబట్టి ధనుష్ 2024ని సాలిడ్ గా స్టార్ట్ చేసాడు. ఇదే సంక్రాంతికి తెలుగులో కింగ్ నాగార్జున కూడా నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ కొట్టేసాడు. నాలుగు రోజుల్లోనే నా సామిరంగ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అన్ని సెంటర్స్ లో రీచ్ అయిపొయింది. ఇలా 2024ని సూపర్ గా స్టార్ట్ చేసిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు కలిసి సినిమా చేయడానికి రెడీ అయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ అయిన ఈ సినిమా చాలా రోజులుగా డిలే అయ్యింది. నాగార్జున, ధనుష్ లకి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. D51 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లిపోయింది.

ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన D51, రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యింది. పూజ కార్యక్రమాల్లో కనిపించిన ధనుష్… గడ్డం లుక్ లో రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తున్నాడు. దాదాపు వడ చెన్నై, అసురన్ సినిమాల లుక్ లోనే ధనుష్ ఉన్నాడు కాబట్టి ఇది యాక్షన్ మూవీ జానర్ లో తెరకెక్కే అవకాశం ఉన్నట్లుంది. కోలీవుడ్ మీడియా ఇప్పటికే D51 ప్రాజెక్ట్ గురించి ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేసేసింది. అయితే ఇన్ని రోజులు D51 గా ఉన్న ఈ సినిమాని #DNS అనే వర్కింగ్ టైటిల్ కి మారిపోయింది. నాగార్జున కూడా వర్కింగ్ టైటిల్ లోకి వచ్చేసాడు అంటే నాగార్జునది ఎక్స్టెండెడ్ క్యామియో అయ్యే అవకాశం ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ ఎప్పుడు బయటకి వస్తాయో తెలియాల్సి ఉంది.

Exit mobile version