Site icon NTV Telugu

Seetha Kalyana Vaibhogame: ఆసక్తికరంగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ ట్రైలర్

Trailer

Trailer

Seetha Kalyana Vaibhogame Trailer Launched: సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం నాడు నిర్వహించిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఓ మై ఫ్రెండ్ టైంలోనే సతీష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ మూవీ ఐడియాను ఏడాదిన్నర క్రితమే చెప్పాడు, సుమన్ అనే కొత్త కుర్రాడు, యంగ్ టాలెంట్‌తో చేస్తున్నానని అన్నాడు. సుమన్ ఫస్ట్ ఫిల్మ్, సతీష్ రెండో చిత్రానికి ఆల్ ది బెస్ట్. నీరూస్ సంస్థకు ఆల్ ది బెస్ట్. రాచాల యుగంధర్‌కు ఆల్ ది బెస్ట్. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్ లో చూడండని అన్నారు.

దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ హర్షిత్ రెడ్డి గారి కజిన్ సుమన్ తేజ్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారని అన్నారు. కొందరికి తాతలు, ముత్తాతల పేర్లు కూడా తెలీదు. కానీ రాముడి గుడి లేని ఊరు ఉండదు. ఆయన బతికిన విధానం వల్లే అందరికీ గుర్తుండిపోయారు. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తీశా, ఈ చిత్రం కోసం యూనిట్‌లోని ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

Exit mobile version