Site icon NTV Telugu

Skanda: ఈ ఇద్దరికీ మాస్ సాంగ్ పడితే మనకి పూనకాలు వస్తాయేమో

Skanda

Skanda

ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ముందు మాస్ హీరోగా నిలబడాలని రామ్ పోతినేని, మాస్ సినిమా చేయాలి అంటే నా తర్వాతే అని నిరూపించాలని బోయపాటి శ్రీను ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గతంలో రిలీజ్ అయిన స్కంద టీజర్ లో ఈ హీరో-డైరెక్టర్ చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. రామ్ పోతినేని పర్ఫెక్ట్ బోయపాటి హీరోలా మారిపోయి కొత్తగా కనిపిస్తున్నాడు. టీజర్ కి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి శ్రీను, రామ్ పోతినేనిలతో ఇప్పటికే వర్క్ చేసి సూపర్బ్ ఆల్బమ్స్ ఇచ్చిన థమన్, మరోసారి స్కంద మూవీకి సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చినట్లు ఉన్నాడు.

ఇప్పటికే స్కంద ఆల్బమ్ నుంచి “నీ చుట్టూ చుట్టూ” అంటూ సాగే ఫస్ట్ సాంగ్ బయటకి వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సాంగ్ లిరికల్ వీడియోలో రామ్ పోతినేని అండ్ శ్రీలీలా చేసిన ఎనర్జిటిక్ డాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే ఇది శాంపిల్ మాత్రమే అసలు జాతర ఇప్పుడు మొదలవుతుంది అంటూ మేకర్స్ స్కంద సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసారు. గందరబాయ్ అంటూ సాగనున్న ఈ సాంగ్ ఆగస్టు 18న సాయంత్రం 5:49 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 6:21కి ప్రోమోని రిలీజ్ చేయనున్నారు. సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్స్ లో రామ్ పోతినేని అండ్ శ్రీలీలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు. కంప్లీట్ గా మాస్ లుక్ లో మారిపోయి థియేటర్స్ లో పూనకాలు తీసుకోని రావడానికి రెడీ అయ్యారు. రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ గెటప్ లో ఉన్నాడు. ఈ సాంగ్ షూటింగ్ ఇటీవలే జరిగింది, ఈ సాంగ్ తోనే స్కంద షూటింగ్ కి కంప్లీట్ అయ్యింది.

Exit mobile version