NTV Telugu Site icon

Screen Writer Passed Away: ప్రముఖ సినీ రచయిత కన్నుమూత

Balaram Mattannur Passed Away

Balaram Mattannur Passed Away

Screenwriter Balram Mattannur Passes Away: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా ప్రతి రోజు ఏదో ఒక సినీ పరిశ్రమ నుంచి ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ సినీ రచయిత, బలరామ్ మట్టనూర్ కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 62 ఏళ్లు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జయరాజ్ దర్శకత్వం వహించి, 1997లో విడుదలైన కాళియాట్టం, బలరామ్ మట్టన్నూర్ అందించిన స్క్రిప్ట్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా. అంతేకాక బలరామ్ కర్మయోగి, సమవాక్యం, అన్య లోకం, ఫాదర్ అండ్ సన్, హోలీ స్పిరిట్ మరియు అక్వేరియం వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించాడు.

Yuvan Shankar Raja: అంతా తూచ్ అంటూ స్వీట్ షాకిచ్చిన యువన్ శంకర్ రాజా

పాఠశాల రోజుల్లో సాహిత్యంపై ఆసక్తి కనబరిచిన బలరాం తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే తొలి నవల ‘గ్రామం’ రాశారు. కానీ ఈ నవల అతనికి ఇరవై దాటాక ప్రచురించబడింది. బలరాం మట్టన్నూరు కథా రచయితగానే కాకుండా అనేక పుస్తకాలు కూడా రాశారు. మరో నవల కాశీతో పాటు బాలన్ (జ్ఞాపకాలు), ముయల్ గ్రామం, రవి భగవాన్ మరియు కట్టంగ నాటంగ (బాల సాహిత్యం) వంటి పుస్తకాలను కూడా రచించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కన్నూర్ పుల్లూపి కమ్యూనిటీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు భార్య సౌమ్య. కూతురు గాయత్రి బలరామ్, తోబుట్టువులు: జయరామ్, శైలజ, భార్గవరామ్ అలాగే లతీష్ కూడా ఉన్నారు.