Satyaraj Says he feared after watching Mansion 24 Trailer: రాజు గారి గది సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ ఈసారి మాన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. హాట్ స్టార్స్ స్పెషల్స్ గా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ జనాల్లో ఇంట్రెస్ట్ పెంచేసింది. ఇక రేపటి నుంచి స్ట్రీమింగ్ కానున్న మాన్షన్ 24లో సత్యరాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి.శర్మ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మాన్షన్ 24 ప్రీ రిలీజ్ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరగగా సత్య రాజ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ మాన్షన్ 24 వెబ్ సిరీస్ లో వర్క్ చేయడం హ్యాపీగా ఉందని ఓంకార్ తన పర్ ఫెక్షన్ తో ఈ హారర్ సిరీస్ ను ఆకట్టుకునేలా రూపొందించాడని అన్నారు.
Allu Arjun: పుష్ప షూట్ కి బ్రేక్.. భార్యతో ఢిల్లీకి అల్లు అర్జున్.. ఎందుకంటే?
నేను సెట్ లో ఏమాత్రం ఖాళీ టైమ్ దొరికినా వాకింగ్ చేస్తుంటాను కానీ మాన్షన్ 24 సెట్ లో ఓంకార్ నాకు అలాంటి టైమ్ ఇవ్వలేదని, పర్ ఫెక్ట్ గా వర్క్ చేయించుకున్నాడని అన్నారు. ఈ సిరీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ కు తండ్రి క్యారెక్టర్ చేస్తున్నా, నేను శరత్ కుమార్ కలిసి నటించే సినిమాల షూటింగ్ టైమ్ లో వరలక్ష్మీ సెట్ కు వచ్చేది, అయితే అప్పుడు ఆమె చిన్న పాప కానీ ఇప్పుడు ఆమెతో కలిసి నటిస్తుండటం ఆ మెమొరీస్ గుర్తుకు తెస్తోందని అన్నారు. వీర సింహారెడ్డి లో వరలక్ష్మి యాక్టింగ్ చూసి షాక్ అయ్యానని పేర్కొన్న ఆయన నేను దెయ్యాలు ఉన్నాయంటే నమ్మను కానీ మాన్షన్ 24 ట్రైలర్ చూశాక భయమేసిందన్నారు. హారర్ ఫిలింస్ తో మెప్పించాలంటే దర్శకుడికి ఫిలిం మేకింగ్ లో కొన్ని జిమ్మిక్ లు తెలిసి ఉండాలి, అలాంటివి ఓంకార్ కు బాగా తెలుసని మాన్షన్ 24 సీజన్ 1 ఎండింగ్ బాహుబలి 1 క్లైమాక్స్ లాంటి ఇంపాక్ట్ తో ఉంటుందన్న ఆయన ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వాలన్నారు.