NTV Telugu Site icon

Satyadev : రివ్యూ రైటర్స్ మరోసారి మా సినిమా చూడాలి!

Satyadev On Godfather

Satyadev On Godfather

టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ నటించిన న్యూ ఏజ్ ఎంటర్టైనర్ ‘జీబ్రా’ హిట్ విజయాన్ని అందుకుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించారు. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. జీబ్రా బొమ్మ సూపర్ హిట్ సక్సెస్ మీట్ లో హీరో సత్య దేవ్ మాట్లాడుతూ డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ నన్ను రాటుతేలేలా చేశాడు. మనిషిగా ఈ సినిమాతో చాలా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యాను. అన్నయ్య చిరంజీవి చెప్పినట్లు జీబ్రా బొమ్మ సూపర్ హిట్ అయింది. అన్నిటికీ అతీతంగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికీ దాదాపు 25 షోలకి వెళ్లాను.

Mangli: సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం

ప్రతి చోట హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అన్నిటికీ అతీతంగా సినిమా ఆడుతుందని నమ్మకాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు ఇచ్చారు. మా సినిమాకి 80% పాజిటివ్ ఉంది. 20% మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఈ 20% కి కూడా మరొకసారి చూడమని కోరుతున్నాను. సినిమాలో ప్రతి పాయింట్ కి ఒక లాజిక్ ఉంటది. ఒకవేళ మిస్ అయ్యింటే రెండోసారి చూసినప్పుడు కనెక్ట్ అవుతారని బావిస్తున్నాను. అయితే అన్నిటీకీ అతీతంగా హౌస్ ఫుల్ అవుతున్నాయి. అది నాకు గొప్ప కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈశ్వర్ కార్తీక్ ఐదేళ్లు కష్టపడి తెలుగు నేర్చుకుని తెలుగులో సినిమా చేయాలని ఈ సినిమా చేశారు. తమిళ్, కన్నడ లో కూడా సినిమా అద్భుతంగా ఆడుతుంది. ఈశ్వర్ భవిష్యత్తులో రజనీకాంత్, షారుక్ ఖాన్, అన్నయ్య చిరంజీవి గారి లాంటి పెద్ద హీరోలతో కూడా పనిచేస్తాడని నమ్మకం నాకుంది. తనకి ఆ కెపాసిటీ ఉంది. మా నిర్మాతలు బాల, దినేష్, ఎస్ ఎన్ రెడ్డి గారికి థాంక్ యూ. ఈ సినిమా సూపర్ హిట్ చేసి మమ్మల్ని గెలిపించిన ఆడియన్స్ కి థాంక్ యూ’ అన్నారు.

Show comments