Sathyathil Sambhavichathu OTT: లంకె బిందెల కోసం తవ్వితే.. ఊరంతా షాక్ అయ్యే నిజం!.. ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sathyathil Sambhavichathu OTT: ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. వీటిలో సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్ జానర్ సినిమాల తెలుగు ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఒక గ్రామంలో ఉండే లంకె బిందెల చుట్టూ సాగే ఈ థ్రిల్లర్ ‘సత్యత్తిల్ సంభవిచ్చతు’ (Sathyathil Sambhavichathu) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.
సన్ నెక్ట్స్ (Sun NXT)లో స్ట్రీమింగ్
మలయాళ కామెడీ మిస్టరీ డ్రామా ‘సత్యత్తిల్ సంభవిచ్చతు’ థియేటర్లలో 2026 జూన్ 19న విడుదలైంది. ప్రశాంత్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆకాష్ మీనన్, దిల్షానా, దిలీష్ పోతన్ మరియు జానీ ఆంటోనీ ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమై ఈ వారం 2026 ఆగస్టు 7 నుండి Sun NXTఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌తో పాటు ప్రమోషనల్ క్యాప్షన్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. వాళ్లు నిజంగా నిధిని కనిపెడతారా ? భయంకరమైన నిజాలను బయటపెడతారా? అనే ప్రశ్నతో ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ మోహన్ ఈ మూవీని పూర్తిగా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించారు. సెకండాఫ్‌లో వచ్చే సస్పెన్స్ రివీల్స్, ట్విస్టులు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మంచి ఈ మూవీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
Also Read
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ఈ సినిమా కథ
ఒక గ్రామంలో తరతరాలుగా ప్రచారంలో ఉన్న గుప్తనిధి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. పాత బావులు కింద భారీ నిధి దాగి ఉందన్న నమ్మకంతో కొందరు గ్రామస్థులు అన్వేషణ మొదలుపెడతారు. అయితే అనుకోకుండా ఆ నిధికి సంబంధించిన కొన్ని ఆధారాలు బయటపడటంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగుతుంది. ఆ నిధిని దక్కించుకునే క్రమంలో గ్రామస్థుల మధ్య జరిగే పొరపాట్లు, అపార్థాలు, ఊహించని ట్విస్టులతో కూడిన ఉత్కంఠభరితమైన ప్రయాణమే ఈ సినిమా కథాంశం. గుప్తనిధి వేట చివరకు ఎలా ముగుస్తుందనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఇటీవలి కాలంలో మలయాళ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. విభిన్న కథలు, బలమైన కథనం, సహజమైన నటన కారణంగా ఈ చిత్రాలు ఓటీటీలో మంచి విజయాలు నమోదు చేస్తున్నాయి. అదే కోవలో వస్తున్న ‘సత్యత్తిల్ సంభవిచ్చతు’ కూడా మిస్టరీ, సస్పెన్స్, కామెడీ కలయికతో వీకెండ్ వాచ్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త తరహా థ్రిల్లర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఆగస్టు 7 నుంచి సన్ నెక్ట్స్‌లో ఈ సినిమా బెస్ట్ సజెషన్ గా మారొచ్చు.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!