Karur-Stampede:సినీ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ తొక్కిసలాటలో మంది దాకా చనిపోయారు. విజయ్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ మీద కమల్ హాసన్, రజినీకాంత్ స్పందించారు. అటు రాజకీయ నేతలు ఈ విషయంపై నానా రచ్చ చేస్తున్నారు. తాజాగా సత్యరాజ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. మనం అనుకోకుండా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అలాంటివి జరిగినప్పుడు వాటిని సరిచేసుకోవాలి. చిన్న తప్పులను సరిచేసుకోవాలి. ఒక పెద్ద తప్పు జరిగిందంటే దాన్ని మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలి.. ఛీ.. అంటూ రియాక్ట్ అయ్యారు సత్యరాజ్.
Read Also : Pawankalyan : మెగా ఫ్యామిలీకి ఆ లోటు తీర్చేసిన పవన్
ఇక్కడ సత్యరాజ్ ఒక రకంగా విజయ్ కు కౌంటర్ వేశారు. ఎందుకంటే గతంలో విజయ్ సభల్లో కొందరు చనిపోయారు. విజయ్ పొలిటికల్ సభల్లో ఇప్పటికే 8 మంది చనిపోయారు. ఇన్ని సార్లు ప్రాణ నష్టం జరుగుతున్నా సరే విజయ్ దాన్ని సరిచేసుకోకుండా ఇంత పెద్ద నష్టానికి కారణం అయ్యాడని సత్యరాజ్ ఇన్ డైరెక్ట్ గా విమర్శలు గుప్పించారన్నమాట. తమిళనాడు పోలీసులు కూడా ఇదే చెబుతున్నారు. విజయ్ సభలు, ర్యాలీలు జరిగినప్పుడల్లా ప్రజలను కంట్రోల్ చేయలేకపోతున్నామని కోర్టుకు వివరించారు. అందుకే విజయ్ సభలు, ర్యాలీలకు ప్రత్యేక రూల్స్ పెట్టామని.. కానీ వాటిని పాటించకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగిందంటున్నారు పోలీసులు.
Read Also : Kayadu Lohar : విజయ్ ఎంత మందిని బలితీసుకుంటావ్.. ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్
