Site icon NTV Telugu

Jagadeesh Prathap Bandari: ‘గోదారి’తో సత్తిగానికి దెబ్బడిపోనాది!

Godari

Godari

AHA: ‘పుష్ప’ ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి హీరోగా నటించిన తొలి చిత్రం ‘సత్తిగాని రెండు ఎకరాలు’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తొలిసారి ఈ ఓటీటీ మూవీని అభినవ్ దండు దర్శకత్వంలో నిర్మించింది. రాజ్ తిరందాసు, ‘వెన్నెల’ కిశోర్, బిత్తిరి సత్తి, మోహన శ్రీ సురాగ, అనీషా దామా ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ లో కీలక పాత్రలు పోషించారు. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 17న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. కానీ అనుకున్న తేదీకి ఈ సినిమా స్ట్రీమింగ్ కాలేదు. దాంతో ఏప్రిల్ 1 వరకూ ఓపిక పట్టమని చెప్పింది. ఆ రోజు కూడా ఆహాలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయలేదు.

మార్చి 17న ‘సత్తిగాని రెండు ఎకరాలు’ రావడం లేదని ఓ రోజు ముందే చెప్పిన ఆహా సంస్థ ఈసారి కొత్త డేట్ ను కూడా ప్రకటించలేదు. కనీసం ఏప్రిల్ 1న స్ట్రీమింగ్ చేయలేకపోతున్నామనీ తెలియ చేయలేదు. అయితే… శ్రీరామ నవమి కానుకగా మార్చి 30వ తేదీన ఆహాలో ‘గోదారి’ అనే డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేశారు. భద్రాచల రాముడి పాదాల మీదుగా సాగిపోయే గోదావరి నదికి సంబంధించిన ఈ డాక్యుమెంటరీని సెంటిమెంట్ గా ఆ రోజున స్ట్రీమింగ్ చేయడం బాగుంటుందని ఆహా టీమ్ భావించినట్టుగా ఉంది. అందుకే చివరి క్షణంలో ‘సత్తిగాని రెండు ఎకరాలు’ను ఆపేసి, ‘గోదారి’ మీద దృష్టి పెట్టారు. ఏదేమైనా ‘సత్తిగాని రెండు ఎకరాలు’కు ‘గోదారి’ దెబ్బేసినట్టు అయిపోయింది. మరి ఈ సినిమాను కనీసం ఏప్రిల్ 7న అయినా స్ట్రీమింగ్ చేస్తారేమో చూడాలి.

Exit mobile version