Vadhandhi 2: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్‌కు సీక్వెల్.. ‘వధండి 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఈసారి హీరో మారిపోయాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vadhandhi 2: ఓటీటీ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ముంచెత్తే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి సిరీస్‌లలో 2022లో విడుదలైన ‘వధండి’ ఒకటి. ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కథ, స్క్రీన్‌ప్లే, ట్విస్టులతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సిరీస్‌కు కొనసాగింపుగా ‘వధండి 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించడంతో మరోసారి ఓటీటీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. మొదటి భాగాన్ని ప్రముఖ దర్శక ద్వయం పుష్కర్, గాయత్రి నిర్మించగా, అదే బ్యానర్లో రెండో భాగం కూడా రూపొందింది. అయితే ఈసారి ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది. తొలి సీజన్లో ప్రధాన పాత్ర పోషించిన ఎస్.జె. సూర్య స్థానంలో ప్రముఖ నటుడు శశికుమార్ కథానాయకుడిగా కనిపించనున్నారు. దీంతో కొత్త కథతో పాటు కొత్త హీరో ఈ సిరీస్‌ను ఎలాంటి స్థాయికి తీసుకెళ్తాడన్న ఆసక్తి నెలకొంది.
ప్రైమ్ వీడియో అధికారిక ప్రకటన ప్రకారం ‘వధండి 2’ ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సిరీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్‌ను విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో శశికుమార్‌తో పాటు యశ్వంత్, అనఘ మారుతోర, అపర్ణా దాస్, వివేక్ ప్రసన్న, రేవతి శర్మ, అర్జున్ నందకుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు ఆండ్రూ లూయిస్ ఈ సీజన్‌కు దర్శకత్వం వహించారు. మొదటి భాగంలో కనిపించిన ఉత్కంఠను కొనసాగిస్తూ, మరింత ఇంటెన్స్ తో సాగే ఇన్వెస్టగేషన్ కథను ఈసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!
- Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?
- Adipurush: 'ఆదిపురుష్' నా కెరీర్లో అతిపెద్ద తప్పు.. రైటర్ షాకింగ్ కామెంట్స్!
- Tollywood: అన్నీ మేమే చేయాలంటున్న హీరోలు!
కథ విషయానికి వస్తే, మధురై శివార్లలోని ఒక నిర్జన ప్రాంతానికి బదిలీపై వెళ్లిన ఎస్ఐ మూసా రాజా చుట్టూ కథ తిరుగుతుంది. అక్కడ ఆయన ఒక పాత రాజకీయ కేసును ఛేదిస్తాడు. అయితే తన ఇన్వెస్టగేషన్ ఫలితంగా ఒక అమాయకుడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడనే నిజం బయటపడుతుంది. ఆ తప్పును సరిదిద్దేందుకు రాజా మళ్లీ పాత కేసు తిరగదోడాల్సి వస్తుంది. నిజాన్ని వెలికితీసే ప్రయాణం ఈ సీజన్ ఉత్కంఠంగా ఉండబోతోంది. మొదటి భాగం సస్పెన్స్, ఎమోషన్, ఇన్వెస్టిగేషన్ అంశాలతో మంచి విజయాన్ని అందుకోవడంతో రెండో భాగంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా శశికుమార్ కొత్త పాత్రలో ఎలా మెప్పిస్తారు, కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది, మొదటి సీజన్ విజయాన్ని కొనసాగిస్తుందా అనే ఆసక్తి ఓటీటీ ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ‘వధండి 2’ ఆగస్టు నెలలో తప్పక చూడాల్సిన వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Tags
- cinema
- Vadhandhi 2
తాజావార్తలు
-
Vadhandhi 2: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్‌కు సీక్వెల్.. ‘వధండి 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఈసారి హీరో మారిపోయాడు!
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!