NTV Telugu Site icon

Sarpatta: ఒటీటీలో రిలీజ్ అయిన సినిమాకి థియేట్రికల్ సీక్వెల్…

Sarpatta

Sarpatta

ఐడియాలాజికల్ సినిమాలు చేసే పా.రంజిత్ తన మార్క్ మూవీస్ నుంచి కాస్త పక్కకి వచ్చి చేసిన మూవీ ‘సార్పట్ట పరంబరై’. ఆర్య హీరోగా నటించిన ఈ మూవీ నార్త్ చెన్నై ప్రాంతంలో 80’ల కాలంలో జరిగే బాక్సింగ్ కథతో తెరకెక్కింది. వారసత్వంగా బాక్సింగ్ ని పాటించే రెండు వర్గాల మధ్య పా.రంజిత్ రాసిన కథ కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ముందుగా పా.రంజిత్ సార్పట్ట పరంబరై కథని సూర్య, కార్తిలకి రాసుకున్నాడు కానీ ఈ ఇద్దరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో ఆర్య చేతికి వెళ్లింది. ఆర్యకి అపోజిట్ రోల్ ‘జాన్ కొక్కెన్’ నటించాడు. కోవిడ్ కారణంగా థియేట్రికల్ రిలీజ్ ని మిస్ అయిన సార్పట్ట పరంబరై సినిమా నేరుగా ఒటీటీలో రిలీజ్ అయ్యింది. ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ వరకూ అందరి దగ్గరి నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ పా.రంజిత్ తో పాటు ఆర్యకి కూడా కంబ్యాక్ ఫిల్మ్ అయ్యింది.

థియేటర్ లో రిలీజ్ అయ్యి ఉంటే సార్పట్ట పరంబరై సినిమాకి మంచి రీచ్ వచ్చేది అనే ఫీలింగ్ ఆడియన్స్ తో పాటు మేకర్స్ లోనూ ఉంది. అందుకే దర్శకుడు పా.రంజిత్ సార్పట్ట పరంబరై సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేశాడు. అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సీక్వెల్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. పా.రంజిత్ ప్రస్తుతం చియాన్ విక్రమ్ తో ‘తంగలాన్’ అనే సినిమా చేస్తున్నాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అయిపోగానే పా.రంజిత్ సార్పట్ట పరంబరై 2 పనులు మొదలుపెట్టనున్నాడు. మొత్తానికి ఒటీటీలో రిలీజ్ అయిన ఒక సినిమాకి ఈసారి థియేట్రికల్ సీక్వెల్ వస్తుందనమాట.

Show comments