NTV Telugu Site icon

Sarkaru Vaari Paata: రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపుతున్న ‘సర్కారువారు’

Svp

Svp

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోంది. వింటేజ్ మహేష్ లుక్ సినిమాకు హైలైట్ గా నిలవడం, ఎమోషన్స్, కామెడీ టైమింగ్, కీర్తి, మహేష్ ల రొమాన్స్ తో ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాస్ ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ ‏లోనూ మంచి కలెక్షన్స్ అందుకుంటూ.. మహేశ్ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. ఈ క్రమంలో ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఆల్ టైం టైం రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఇక మొదటి రోజునుంచే ఈ సినిమా రికార్డుల వేట మొదలుపెట్టింది.

సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 75 కోట్ల వసూళ్ళు రాబట్టి అత్యధిక కలెక్షన్స్ సాధించిన ప్రాంతీయ సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనే 36.89 కోట్ల షేర్ రాబట్టి నాన్- ‘ఆర్ఆర్ఆర్’ రికార్డ్ నమోదు చేసింది. అందరు అనుకున్నట్లే అత్యధికంగా నైజాంలో 12.24 కోట్ల వసూళ్లను సాధించింది. గుంటూర్ లో 5.83 కోట్లు, సీడెడ్ లో 4.7 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.73 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈస్ట్ – 3.25 కోట్లు.. వెస్ట్ 3 కోట్లు.. కృష్ణ 2.58 కోట్లు.. నెల్లూరు 1.56 కోట్లు సాధించి మహేష్ సత్తా చూపించింది.

ఇక రెండవ రోజు సైతం ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా రికార్డ్ వసూళ్లను రాబట్టింది. డే 2 కలెక్షన్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాలు కలుపుకొని 11.64 కోట్ల షేర్ అందుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. వివరంగా చెప్పాలంటే నైజాం – 5.2 కోట్లు, సీడెడ్ – 1.45 కోట్లు, యూఏ – 1.65 కోట్లు, ఈస్ట్ – 1.08 కోట్లు, వెస్ట్ – 45 లక్షలు, గుంటూరు – 51 లక్షలు, కృష్ణ – 89 లక్షలు, నెల్లూరు – 41 లక్షలు, మొత్తం – 11.64 కోట్లతో రికార్డులు బద్దలుకొట్టింది.

ఇక నేడు మూడో రోజు కూడా మహేష్ తన పవర్ చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఏపీ లో మహేష్ కు తిరుగు లేదు.. ఆయన రికార్డులకు ఎదురులేదు అన్నట్లుగా రికార్డుల మోత మారుమ్రోగిపోతుంది. ఆదివారం కావడంతో నేడు కలెక్షన్స్ మరింత పెరిగాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇప్పటివరకు సర్కారువారి పాట ఎంత కలెక్ట్ చేసింది అంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 61.54 కోట్ల షేర్ ని రాబట్టి అదరగొట్టింది. నైజాం – 23.27 కోట్లు, సీడెడ్ – 7.92 కోట్లు, ఉత్తరాంధ్ర – 7.33 కోట్లు, గుంటూరు – 6.92 కోట్లు, ఈస్ట్ – 5.39 కోట్లు, కృష్ణ – 4.39 కోట్లు, వెస్ట్ – 3.9 కోట్లు, నెల్లూరు – 2.42 కోట్లు గా ఉన్నట్లు మేకర్స్ తెలిపారు. మొత్తానికి సర్కారువారి పాట హవా మూడు రోజుల నుంచి పెరుగుతుందే కానీ తగ్గడం లేదు.. ఇక యూఎస్ఏలో కూడా మహేశ్ బాబు మూవీ భారీ వసూళ్లు సాధిస్తోంది. ప్రీమియర్స్ తో కలుపుకుని ఇప్పటి వరకు $1.5+ మిలియన్ కలెక్షన్స్ అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. మహేష్ కెరీర్ లో యుఎస్ లో ఈ మార్క్ క్రాస్ చేసిన 8వ సినిమా ఇది. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.