NTV Telugu Site icon

Sarkaru Naukari: రియలిస్టిక్ అప్రోచ్ తో “సర్కారు నౌకరి”

Sarkaru Naukari

Sarkaru Naukari

Sarkaru Naukari Movie Special primier to Media: ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా “సర్కారు నౌకరీ”. ఈ సినిమాలో భావన హీరోయిన్ గా నటించగా ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించారు. గంగన మోని శేఖర్ దర్శకత్వం వహించిన “సర్కారు నౌకరి” సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. ఈ సినిమాను నేడు మీడియా కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లో ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం మూవీ టీమ్ మీడియాతో మాట్లాడారు. దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ – “సర్కారు నౌకరి” కంటెంట్ ఓరియెంటెడ్ గా సాగే సినిమా, యదార్థ ఘటన స్ఫూర్తితో 90వ దశకం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించా. సందేశం, వినోదం రెండు కలిసి సినిమా “సర్కారు నౌకరి”. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. అప్పటి గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదకరంగా కథా కథనాలు ఉంటాయి. రియలిస్టిక్ అప్రోచ్ తో మూవీ ఆకట్టుకుంటుంది అన్నారు

హీరోయిన్ భావన మాట్లాడుతూ “సర్కారు నౌకరి” లాంటి మంచి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం కావడం హ్యాపీగా ఉంది, పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గా నా క్యారెక్టర్ ఉంటుంది. “సర్కారు నౌకరి” సినిమా ప్రతి ఆడియెన్ కు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం, మనసును తాకే ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ కథలో ఉన్నాయి. ఇలాంటి మంచి మూవీని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు.

హీరో ఆకాష్ మాట్లాడుతూ “సర్కారు నౌకరి” మూవీ మా కెరీర్ కు ఫస్ట్ స్టెప్ కొత్త ఏడాదిలో మొదటి రోజు మీ ముందుకు వస్తోంది. ఈ మొదటి అడుగు లో ప్రేక్షకులు విజయాన్ని అందించి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాం. “సర్కారు నౌకరి”లో ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో మీకు కనిపిస్తా, సొసైటీకి మంచి చేయాలనే తాపత్రయం ఒకవైపు, కుటుంబం, స్నేహితుల నుంచి ఎదుర్కొనే సంఘర్షణ మరోవైపు నా క్యారెక్టర్ కు అన్ని ఎమోషన్స్ తీసుకొస్తాయి. “సర్కారు నౌకరి” సినిమాకు మీరు ఇచ్చే రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నాం అన్నారు.