Site icon NTV Telugu

Saripodhaa Sanivaaram: గ్యాప్ ఇచ్చి పనిలో పడిన నాని!

Nani

Nani

Saripodhaa Sanivaaram Lengthy Shooting Schedule Begins In HydNerabad: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండో సారి కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సరిపోదా శనివారం’లో నాని ఒక కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారని చెబుతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ గత నెలలో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ రోజు అంటే బుధవారం నాడు సినిమా యూనిట్ కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఇక ఇది ఒక లెన్తీ షెడ్యూల్ అని, ఇందులో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌లతో పాటు ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్ ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

ISPL Chennai Team: చరణ్, అమితాబ్, హృతిక్ కి పోటీగా బరిలోకి సూర్య

నాని, సహా ఇతర కీలక తారాగణం షూటింగ్‌లో పాల్గొంటారని అంటున్నారు. ఇక సినిమా యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేసిన అన్‌చెయిన్డ్ వీడియోలో చూపించినట్లుగా, నాని సినిమాలో రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తుండగా ఆయన సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్ గా కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాగా ఈ ‘సరిపోదా శనివారం’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version