NTV Telugu Site icon

Saripodha Sanivaram: “సరిపోదా శనివారం” నుంచి సెకండ్ సింగల్ వచ్చేస్తోంది

Nani

Nani

Saripodha Sanivaram Second Single: నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గ నటించిన చిత్రం “సరిపోదా శనివారం” వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య,కళ్యాణ్ దాసరి లు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ మూవీలో ఎస్‌జే సూర్య, సాయికుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.

Also Read: Puja Khedkar: మరో వివాదంలో పూజా.. ఓవరాక్షన్‌కు పోయి కష్టాలు కొనితెచ్చుకున్న ఐఏఎస్

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఆగస్టు 29న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గ రిలీజ్ చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్రనిర్మాతలు ఈ చిత్రంలోని రెండవ సింగిల్ “ఉల్లాసం” సాంగ్ జూలై 13, 2024న విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. అలానే ఇదివరకు రిలీజ్ చేసిన మొదటి సాంగ్ ‘గరం గరం’ పాటకి మంచి స్పందన లభిస్తుంది. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని, ప్రియాంక మోహన్ కలిసి నటిస్తున్న రెండో సినిమా మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.