Site icon NTV Telugu

Sarangapani Jathakam : సారంగపాణి జాతకం సమ్మర్ లో తెలుస్తుంది

Saranaga

Saranaga

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో  సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ కు మంచి ఆదరణ లభించింది.

జాతకాలను బాగా నమ్ముతూ ‘మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది’ అని భావించే హీరో ప్రతిరోజూ ఉదయం పేపర్ చూసి అందులో రాసింది నిజం అవుతుందని నమ్మడమే కాదు, నిజమైన రోజు చుట్టుపక్కల ఎవరున్నారు, ఏం అవుతుంది,  అనేది పట్టించుకోకుండా తన సంతోషాన్ని అందరి ముందు వ్యక్తం చేస్తూ జాతకాలపై అమితమైన నమ్మకం వల్ల అతని జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయి వంటి కథాంశాలతో రానుంది సారంగపాణి జాతకం. వాస్తవానికి ఈ తొలుత డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ట్రైలర్ రిలీజ్ లో పేర్కొన్నారు మేకర్స్. కానీ పుష్ప కారణంగా వాయిదా వేసిన సినిమాలతో పాటు సారంగపాణి కూడా వాయిదా వేశారు మేకర్స్. ఆ తర్వాత జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయగా అక్కడ కూడా వీలుపడలేదు. ఇక తాజాగా ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన సినిమా వేసవి కానుకగా వస్తుందో మళ్ళి అక్కడ కూడా వెనక్కి వెళుతుందో లేదో రానున్న రోజుల్లో తెలుస్తుంది.

Exit mobile version