Site icon NTV Telugu

Sapthami Gowda: స్టార్ హీరో ఫ్యామిలీలో విడాకుల చిచ్చు.. పరువు నష్టం దావా వేసిన కాంతార నటి

Sapthami Gowda Defamation Case

Sapthami Gowda Defamation Case

Sapthami Gowda files defamation case against Sridevi : ఇటీవల, ప్రముఖ సూపర్ స్టార్ కుటుంబ వారసుడు యువరాజ్‌కుమార్ తన భార్య తనను వేధిస్తుందనే కారణంతో విడాకుల కోసం దాఖలు చేసినప్పుడు, యువరాజ్ ఒక నటితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని అతని భార్య శ్రీదేవి ఆరోపించింది. ఈ ఘటనలో ఆ నటి ఎవరనేది ఇప్పుడు వెల్లడైంది. కన్నడ చలనచిత్ర ప్రపంచంలో రాజ్ కుమార్ వారసులు ముందు నుంచి ఎలాంటి పెద్ద వివాదాలకు తావివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అలాంటి కుటుంబానికి వారసుడైన నటుడు యువరాజ్ కుమార్ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీదేవి నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత శ్రీదేవి బైరప్ప కొన్ని నెలల్లోనే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. వీరిద్దరూ కలిసి జీవించింది కొన్ని రోజులే కాబట్టి వీరి విడాకుల కేసులో ఇంకేదో ఉందనే అనుమానం ఒకవైపు తెరమీదకు వస్తూ ఉండగా శ్రీదేవి భైరప్ప తన లాయర్ ద్వారా స్వయంగా వివరణ ఇచ్చారు.

Actor Darshan: ఒక మేనేజర్ మిస్సింగ్.. మరో మేనేజర్ ఆత్మహత్య.. మరిన్ని చిక్కుల్లో దర్శన్?

భర్తతో సత్సంబంధాలు కొనసాగుతుండగానే ఒక్కసారిగా వచ్చిన నటి విడాకులకు కారణమంటూ సంచలనం రేపింది. నేను విదేశాల్లో చదువుతున్నప్పుడు తన భర్త నటితో సన్నిహితంగా ఉంటున్నాడని మా స్నేహితులు, బంధువులు కొందరు చెప్పగా నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే నేను వెకేషన్‌కి ఇండియా వచ్చినప్పుడే వాళ్ల గురించి తెలిసింది. నేను లేనప్పుడు నా భర్త చాలాసార్లు ఆయా యువ నటిని ఇంటికి తీసుకొచ్చాడు. హోటల్ గదిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాను అని శ్రీదేవి ఆరోపించింది. ఈ విషయం వెల్లడి కాగానే ఆ యువ నటి ఎవరా అని చాలా మందికి డౌట్ వచ్చింది కానీ ఆమె ఎవరో ఇప్పుడు తేలింది. ఆ నటి సప్తమి గౌడ అని యువరాజ్ కుమార్ భార్య శ్రీదేవి వైరప్ప చెప్పిన విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీదేవి తన పేరును కించపరిచారంటూ రూ.10 కోట్ల పరువునష్టం దావా వేసింది సప్తమి. ఓ వైపు యువ-శ్రీదేవి విడాకుల కేసు నడుస్తుండగా.. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరగనుందని భావిస్తున్నారు.

Exit mobile version