NTV Telugu Site icon

Sapta Sagaralu Dati Side B: ఇంట్రెస్ట్ పెంచేస్తున్న “సప్త సాగరాలు దాటి సైడ్ బి” ట్రైలర్

Sapta Sagaralu Dhaati Side B

Sapta Sagaralu Dhaati Side B

Sapta Sagaralu Dhaati Side B Trailer: ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. దీంతో ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. నవంబర్ 4న సాయంత్రం 06:06 గంటలకు హీరోయిన్ సమంత ఈ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. సైడ్ బీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా ట్రైలర్ ఉంది.

Bigg Boss 7 Telugu: శోభకు షాక్.. కెప్టెన్ అయిన ఆనందం కూడా లేకుండా చేశావ్ గా నాగ్ మామ!

నవంబర్ 17 నుండి థియేటర్‌లలో ప్రేక్షకులు ఈ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఆస్వాదిస్తారని మేకర్స్ భావిస్తున్నారు. తెలుగులో “సైడ్ ఎ” ఘనవిజయం సాధించినట్లుగానే, “సైడ్ బి” కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడం ఖాయమని సినిమా యూనిట్ నమ్మకంగా ఉంది. హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, అచ్యుత్, చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి తన కెమెరా పనితనంతో కట్టి పడేయగా, చరణ్ రాజ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఇక నవంబర్ 17న “సప్త సాగరాలు దాటి సైడ్ బి” ఘనంగా విడుదల కానుండగా మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.