NTV Telugu Site icon

Santhanam: తెలుగు ప్రేక్షకులే రియల్ సినిమా లవర్స్ : తమిళ నటుడు సంతానం

Santhanam Comments On Telugu Audience

Santhanam Comments On Telugu Audience

Santhanam comments on telugu audience: మన్మధ, నేనే అంబానీ, రాజు రాణి.. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన పాపులర్ తమిళ యాక్టర్ సంతానం హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డీడీ రిటర్న్స్’. సురభి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్.ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఆర్కే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సి.రమేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూలై 29న తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ క్రమంలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఆగస్టు 18న ఈ సినిమాను ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’’ పేరుతో తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

Mr. Pregnant: ‘విజయ్’కి అర్జున్ రెడ్డి, ‘సిద్దు’కి డీజే టిల్లు, ‘సోహైల్’కి మిస్టర్ ప్రెగ్నెంట్

ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ ని లాంచ్ చేసింది. ఇక ఈ క్రమంలో ప్రెస్ మీట్ లో హీరో సంతానం మాట్లాడుతూ ‘డీడీ రిటర్న్స్’ తమిళ్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందని అన్నారు. నా సినిమా తెలుగులో విడుదల చేయడం నా డ్రీం, మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూశానని అన్నారు. ఇక ఈ సినిమా విడుదలైతే అందరూ ఎంజాయ్ చేసేలా ఉండాలి అనుకున్నానని, ఇప్పుడు ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’’ చిత్రంతో తెలుగులో రావడం ఆనందంగా ఉందని అన్నారు. అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇదని పేర్కొన్న ఆయన తెలుగు ప్రేక్షకులే రియల్ సినిమా లవర్స్ అని అన్నారు. ఇక్కడి ప్రేక్షకుల ప్రేమ ప్రోత్సాహంతో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ని సాధించిందని అన్నారు. ఇప్పుడు ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నామని ఆయన అన్నారు. ఈ సినిమాను పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని, చాలా యునిక్ గా ఉంటుందని పేర్కొన్న ఆయన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అన్నారు.

Show comments