NTV Telugu Site icon

Sankrantiki Releases 2025: ముగ్గురు స్టార్లు.. నాలుగు సినిమాలు.. ఎప్పుడెప్పుడంటే?

Sankranthi

Sankranthi

తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి సీజన్ ఒక వరం లాంటిది. ఈ సీజన్లో పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతాయని నమ్మకం ఉంటుంది. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తాయి కాబట్టే సినిమా రిలీజ్ లను సంక్రాంతికి ప్లాన్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు పోటీపడుతుంటారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అయ్యే సినిమాలు దాదాపుగా ఫిక్స్ అయిపోయాయి. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న శంకర్ దర్శకత్వంలోని గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ తో నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 109 సినిమా రాబోతోంది.

Allu Arjun: మాట మార్చిన అల్లు అర్జున్.. ఇలా దొరికేశాడు ఏంటి?

ఇక ఆ తర్వాత మరో రెండు రోజులు గ్యాప్ తీసుకుని సంక్రాంతికి వస్తున్నాం అంటూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలోనే గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం అనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండడం గమనార్హం. ఇక మరోపక్క త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మజాకా అనే సినిమాని కూడా ఒకరోజు గ్యాప్ తో అంటే జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ అన్ని సినిమాలు సంక్రాంతికి వర్కౌట్ అవుతాయని నమ్మకంతోనే ఉన్నారు నిర్మాతలు.

Show comments