NTV Telugu Site icon

Heeramandi: వ్యభిచారులుగా మారిన స్టార్ హీరోయిన్లు.. ఏ రేంజ్ లో చూపిస్తారు

Heeramandi

Heeramandi

Heeramandi: ఓటమి అంటే ఏంటో ఎరుగని దర్శకుడు.. వంద కోట్ల క్లబ్ లో ఎక్కువసార్లు నిలిచిన డైరెక్టర్.. సంజయ్ లీలా భన్సాలీ. ఆయన తీసిన సినిమా ఏదైనా ఒక కళా ఖండమే. ఆయనతో పనిచేయాలని స్టార్ హీరో హీరోయిన్లు తహతహలాడుతుంటారు. గతేడాది అలియా భట్ లాంటి సున్నితమైన అమ్మాయిని గంగూభాయి లాంటి ధైర్యం గల మహిళగా చూపించడం ఆయన వలనే సాధ్యమైంది. వేశ్యా వాటికలో మగ్గుతున్న అమ్మాయిల మనోభావాలు.. వారి పిల్లలు తమలా కాకూడదనే ఆవేదన.. వారందరికీ అండగా నిలబడడానికి వచ్చింది గంగూభాయి.వేశ్యా వృత్తిలో మగ్గుతున్న అమ్మాయిలను తన సొంత డబ్బుతో కాపాడి వారి ఇంటికి పంపించింది. అలాంటి ఆమె కథను ఎంతో హృద్యంగా చూపించాడు భన్సాలీ. గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో గంగూభాయి కతీయవాడి ఒకటి. ఇక తాజాగా ఇలాంటి కథనే మరోసారి మరోవిధంగా చూపించడానికి రెడీ అవుతున్నాడు భన్సాలీ. అదే హీరామండీ. ఈసారి సినిమాలా కాకుండా వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ ఓటిటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

Alia Bhatt: ఇక చాలు.. మీరు లిమిట్ క్రాస్ చేశారు.. నా ఇంట్లోకి కెమెరాలు పెడతారా..?

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మలు మనీషా కొయిరాలా. సోనాక్షి సిన్హా,అదితి రావ్ హైదరీ,రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వ్యభిచారులుగా కనిపించనున్నారు. 1940 కాలంలో హీరామండీ అంటే వేశ్యల జిల్లా.. అందమైన ఆట బొమ్మలను కొనుగోలు.. అమ్మకాలు చేసే ప్రాంతం. అక్కడ జరిగే రాజకీయాలు వేరు.. ద్రోహాలు వేరు. అలాంటి ప్రాంతంలో ఉన్న ఐదుగురు వేశ్యల కథనే హీరామండీ. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన రెండు పోస్టర్స్ లో అందగత్తెలు మాములుగా లేరు.. బాలీవుడ్ అందం అంతా ఒకే పోస్టర్ లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. పోస్టర్ తోనే ప్రేక్షకులను పిచ్చెక్కించాడు భన్సాలీ.. ఇక ఈ సిరీస్ లో వారి మధ్య ఉన్న ప్రేమ, ద్రోహం,వారసత్వం, రాజకీయాలు వంటి అంశాలను చూపించనున్నాడట. ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సిరీస్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

Show comments