Sanjay Dutt : బాక్సాఫీస్ ధురంధర్ సంజయ్ దత్.. 4 సార్లు 1000 కోట్ల క్లబ్‌లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమా హిస్టరీలో 1000 కోట్ల క్లబ్ అంటే ఒకప్పుడు అరుదైన రికార్డు. కానీ ఇప్పుడు ఒక హీరో కాదు, ఒక నటుడు నాలుగు సార్లు ఆ ఫీట్ సాధించాడు. KGF Chapter 2 నుంచి… ధురంధర్ 2 వరకు ప్రతి సినిమాలో డిఫెరెంట్ గెటప్, వెరైటీ అటిట్యూడ్. కానీ, ఒకే కామన్ పాయింట్ స్క్రీన్ మీద కనిపిస్తే, స్క్రీన్ షేక్ అవుతుంది. వెయ్యి కోట్ల క్లబ్ లో ఫోర్ టైమ్స్ చేరిన యాక్టర్ మరెవరో కాదు సంజయ్ దత్. KGF Chapter 2లో సంజయ్ దత్ చేసిన అధీరా పాత్ర.. ఒక విలన్ కాదు, ఒక వైల్డ్ ఫోర్స్. వైకింగ్ స్టైల్ లుక్, రఫ్ బాడీ బ్రూటల్ మెంటాలిటీ రాఖీకి ఎదురు నిలిచే పవర్‌ఫుల్ వారియర్‌గా కనిపించాడు. లంగ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో కూడా తన డబ్బింగ్ తానే పూర్తి చేసి, డెడికేషన్ అంటే ఇదే అని చూపించాడు.
Also Read :Yash : హైప్ ఉన్నంత కంటెంట్ ఉంటుందా?
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
జవాన్ లో సంజయ్ దత్ పాత్ర చిన్నదే అయినా, స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి థియేటర్‌లో విజిల్స్ పడ్డాయి. షారూక్ ఖాన్ తో మొదటి స్క్రీన్ షేర్ చేసుకున్నా, క్లైమాక్స్‌లో ఆయన ప్రెజెన్స్ కథకి మరింత గ్రావిటీ ఇచ్చింది. కొన్ని నిమిషాలే ఉన్నా, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక సినిమా లెవెల్ ! ధురంధర్ లో సంజయ్ దత్ SP చౌదరి అస్లామ్ గా, ఒక రియల్ లైఫ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపించాడు. రూల్స్‌ని పట్టించుకోని అగ్రెసివ్ పోలీస్, గ్రాంగ్‌స్టర్స్ మీద యుద్ధం చేసే ఒక రూత్ లెస్ ఆఫీసర్. ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించే ప్రతి సీన్‌లో భయం, రిస్పెక్ట్ రెండూ కలుగుతాయి. ధురంధర్ 2లో అదే అస్లాం క్యారెక్టర్ మరింత పవర్‌ఫుల్‌గా, SSP రేంజ్‌లో మరింత అగ్రెసివ్‌గా మారింది. సిస్టమ్‌కి బయట పని చేసే ఆఫీసర్‌గా, గ్యాంగ్స్, మిలిటెంట్స్‌పై విరుచుకుపడే ఒక యుద్ధంలా కనిపించాడు. “బడే సాబ్” అనే మిస్టరీతో, కథకి ఇంకో లేయర్ తీసుకొచ్చాడు. అస్లామ్ చౌదరీ అనే పాత్రతో సంజయ్ దత్ తన రేంజ్ వాల్డ్‌వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. నాలుగు సినిమాలు, నాలుగు వేర్వేరు పాత్రలు… కానీ ఒకే రిజల్ట్… 1000 కోట్ల సునామీ! అందుకే సంజయ్ దత్ కేవలం ఒక నటుడు కాదు, బాక్సాఫీస్ కా ధురంధర్.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!