Site icon NTV Telugu

Sanjay Dutt: సంజు భాయ్ బాగానే ఉన్నాడట.. కంగారు పడకండి

Sanjay

Sanjay

Sanjay Dutt: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు ప్రమాదం జరిగిందని నిన్నటి నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. సంజయ్ దత్ ప్రస్తుతం కన్నడ సినిమా కేడి లో నటిస్తున్నారు. కన్నడ హీరో ధృవ్ సర్జా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ షూటింగ్ సమయంలోనే సంజయ్ ప్రమాదానికి గురయ్యాడని, తీవ్ర గాయాలు అయ్యాయని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు సంజయ్ కు ఏమయ్యిందని కంగారు పడుతున్నారు. ఇక ఈ వార్తలు సంజయ్ వరకు వెళ్లడంతో ఆయన స్పందించక తప్పలేదు. ఈ ప్రమాదం న్యూస్ అంతా ఫేక్ అని సంజయ్ తేల్చి చెప్పాడు. తన ఆరోగ్యం అంతా బాగానే ఉందని, తాను ఆరోగ్యంగానే ఉన్నాను అని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

Ram Charan Prabhas: అక్కడ మాత్రం ప్రభాస్, రామ్ చరణ్ తర్వాతే ఎవరైనా…

“నాకు గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. అవి పూర్తిగా నిరాధారమైనవని. నేను ఈ విషయమై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను KD సినిమా షూటింగ్ చేస్తున్నాను. నా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు టీమ్ చాలా జాగ్రత్తగా ఉన్నారు.నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు, ఆందోళనకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు ఊపిరి తీసుకున్నారు. సంజయ్ దత్ క్యాన్సర్ నుంచి కోలుకున్నాకా హీరోగా కంటే విలన్ గానే ఎక్కువ కనిపిస్తున్నాడు. ముఖ్యంగా సంజయ్ విలన్ గా నటించిన కెజిఎఫ్ 2 ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి క్రూరమైన పాత్రలాంటిదే KD సినిమా లో చేస్తున్నాడట సంజయ్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version