Site icon NTV Telugu

Sanjanaa Galrani : చక్కటి ప్లానింగ్‌తో ‘మణిశంకర్’ మూవీ!

Mani Sankar

Mani Sankar

Siva Kantamaneni : శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్డే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన సినిమా ‘మణిశంకర్’. జి.వి.కె. (జి. వెంకట్ కృష్ణన్) కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించడంతో పాటు దర్శకత్వమూ వహించారు. దీన్ని కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి స్పంద‌న ల‌భించిదని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ మూవీ గురించి సంగీత దర్శకుడు ఎం. ఎల్. రాజా మాట్లాడుతూ, ”సినిమా ఫస్ట్ కాపీ అద్భుతంగా వచ్చింది. స్క్రీన్ ప్లే బాగుంటుంది. యాక్షన్స్, విజువల్స్ అన్నీ బాగుంటాయి. శంకర్ సర్ అద్భుతంగా నటించారు. సినిమా అంతా కూడా ఒకే టెంపోలో ఉంటుంది. సంజన, ప్రియా హెగ్డే బాగా నటించారు” అని అన్నారు.

హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ, ”ఒక సంఘటన చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతుంది. ఇందులో ఓ ఫిలాసఫీ కూడా ఉంటుంది. సినిమా ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రేక్షకుడిని లీనమయ్యేలా ఉంటుంది. జనవరి మొదటి వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారు. అనుకున్న బడ్జెట్‌లోపే సినిమాను అద్భుతంగా నిర్మించాం. ఇళయరాజా శిష్యుడు ఎం. ఎల్. రాజా మా సినిమాకు సంగీతం అందించడం ఆనందంగా ఉంది” అని అన్నారు. డైరెక్టర్ జి. వెంక‌ట్‌ కృష్ట‌న్ మాట్లాడుతూ, ”మనిషికి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఏ మనిషీ హీరోగా పుట్టడు. ప్రతి ఒక్కరిలో విలనిజం కూడా ఉంటుంది. ఈ కథలో హీరోలు, విలన్స్ ఎవరు అని ఉండరు. శంకర్‌ కథ విన్న వెంటనే సోల్ పట్టేసుకున్నారు. సంజన పోషించిన పాత్రలోనూ చాలా డైమన్షన్స్ ఉన్నాయ్. అందుకే ఆమెను ఆ కారెక్టర్ కోసం అడిగాం. ప్రియా హెగ్డే, చాణ‌క్య పోషించిన పాత్రలు కూడా బాగుంటాయి. పాటలు, ఫైట్స్ కూడా కథలో భాగంగానే వస్తాయి. రెండు గంటలు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.

సంజన గల్రానీ మాట్లాడుతూ, ”కరోనా తరువాత నాకు ఈ ఆఫర్ వచ్చింది. శివ కంఠమనేని, బాబీ గారికి థాంక్స్. శివ గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. చక్కగా నటించారు. ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్ రెడ్డి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాతలు చాలా మంచి వారు. చక్కటి ప్లానింగ్‌తో దీనిని నిర్మించారు. ఈ చిత్ర యూనిట్‌తో పని చేయడం నాకు ఆనందంగా ఉంది” అని అన్నారు.

Exit mobile version