Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ జులై 6కు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగిన విషాదకర తొక్కిసలాట కేసు విచారణ నాంపల్లి కోర్టులో ముగిసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరూ వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలోనే న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో అల్లు అర్జున్ మినహా నిందితులు కోర్టుకు హాజరయ్యారు. అయితే ముంబైలో షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా స్టార్ హీరో అల్లు అర్జున్ ఈ విచారణకు హాజరు కాలేకపోయారు.
హీరో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరై అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నారని వివరిస్తూ ‘ఆబ్సెంట్ పిటిషన్’ దాఖలు చేశారు. బన్నీ విచారణకు హాజరు కాలేని పరిస్థితులను న్యాయస్థానానికి నివేదించారు లాయర్లు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి అల్లు అర్జున్ ఎందుకు హాజరు కాలేకపోయారో ‘మెమో’ దాఖలు చేయాలని న్యాయవాదులను ఆదేశించారు. కేసులో నిందితులందరూ విచారణకు సహకరించాలని తదుపరి విచారణలో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ తరపున దాఖలైన విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ కేసు విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసింది. వర్చువల్ గా హాజరయ్యేందుకు అల్లు అర్జున్ కు అనుమతిస్తారా లేరా అనే అంశంపై ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఈరోజు జరిగిన విచారణకు అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులంతా కోర్టుకు హాజరయ్యారు. కాగా ఈ తొక్కిసలాట ఘటనలో చికడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను A11 (11వ నిందితుడిగా) పేర్కొంటూ చార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..