NTV Telugu Site icon

Sandeep Reddy Vanga: ఏంటీ… ఈ ఇంటర్వ్యూ CGనా? మేము ఒరిజినల్ అనుకున్నామే

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

అనిమల్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర 850 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. ఒక అడల్ట్ రేటింగ్ ఉన్న సినిమా ఇండియాలో ఈ రేంజ్ హిట్ అవుతుందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా అనిమల్ సినిమా హిట్ అయ్యింది. దాదాపు మూడు వారాల పాటు థియేటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేసిన అనిమల్ మూవీ కంప్లీట్ గా డైరెక్టర్స్ సినిమాగా పేరు తెచ్చుకుంది. రణబీర్ కపూర్ లోని యాక్టింగ్ బీస్ట్ ని బయటకి తెచ్చాడు సందీప్ రెడ్డి వంగ. సినిమాల్లోనే కాదు బయట ఇంటర్వ్యూస్ లో కూడా సెన్సేషనల్ గా మాట్లాడడం సందీప్ కి బాగా అలవాటు. ముఖ్యంగా క్రిటిక్స్ గురించి సందీప్ రెడ్డి వంగ చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా మాట్లాడుతాడు. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సందీప్ వంగ… క్రిటిక్స్ ని ఇల్లిటిరేట్స్ అని, డబ్బులు ఇస్తేనే బాగా రాస్తారు అని, అందరూ చైనాకి వెళ్లిపోవాలి అని కామెంట్స్ చేసాడు.

ఈ కామెంట్స్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ఫరీదూన్ ఎక్స్ప్రెషన్స్ ని మీమ్స్ గా వాడేస్తున్నారు అంటే సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ కి యాంకర్ ఎంత షాక్ అయ్యాడో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ ఇంటర్వ్యూ కంప్లీట్ గా గ్రాఫిక్స్ తో చేసింది… ముంబైలో సందీప్ రెడ్డి వంగ ఉండగా, ఫరీదూన్ కెనడాలో ఉన్నాడు. ఈ ఇద్దరూ ఎదురెదుగా కూర్చోని ఇంటర్వ్యూ చేస్తున్నట్లు సెటప్ క్రియేట్ చేసి వీడియోని ఎడిట్ చేసారు. సందీప్ తన ఎదురుగా ఒక పర్సన్ లేకున్నా కూడా అంత ఇంటెన్స్ తో ఎలా మాట్లాడాడో తనకే తెలియాలి. మొత్తం ఇంటర్వ్యూని మళ్లీ క్లియర్ గా చూసినా కూడా ఇది గ్రాఫిక్స్ అనే విషయం తెలియకపోవచ్చు.

Show comments