Rapo 23 : రామ్ సినిమాకు హీరోయిన్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మొదటిసారి దర్శకత్వం వహించబోతున్న చిత్రం పై అనౌన్స్మెంట్ నుంచే మంచి హైప్ ఏర్పడింది. రామ్ కెరీర్లో 23 చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజక్ట్‌ను మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించాలని రామ్ ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు.
అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. మొదట్లో ఫలానా బ్యూటీ ఫైనల్ అయిందనే వార్తలు రాగా.. బడ్జెట్ కారణంగా ఓ కొలిక్కి రావడం లేదు. అయితే, లేటెస్ట్గా ఈ సినిమాలో రామ్ సరసన కథానాయికగా టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్తా మీనన్ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి చర్చలు తుది దశలో ఉన్నాయని వినికిడి. కథ మరియు పాత్ర నచ్చడంతో సంయుక్తా మీనన్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పినట్టుగా టాక్ నడుస్తోంది. త్వరలోనే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతోంది సంయుక్తా మీనన్. స్లమ్ డాగ్, స్వయంభూ వంటి భారీ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘బ్లాక్ గోల్డ్’ వంటి విభిన్నమైన ప్రాజెక్ట్‌తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఖాతాలోకి మరో బంపర్ ఆఫర్ వచ్చి చేరినట్లే. మరి రామ్ పోతినేని, సంయుక్త మీనన్ జోడీ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Rapo 23 : రామ్ సినిమాకు హీరోయిన్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే?
-
Meghalaya Honeymoon Murder Case: ‘నేను అమాయకురాలిని, నన్ను ఇరికించారు’.. సోనమ్ సంచలన వ్యాఖ్యలు..
-
Drugs Busted: అత్తాపూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. MDMAతో పాటు భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం.!
-
Crispy Mini Samosa Recipe: ఇంట్లోనే సులభంగా కరకరలాడే మినీ సమోసాల తయారీ
-
PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్ ప్రారంభం
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!