Site icon NTV Telugu

Martin Luther King Trailer: నవ్విస్తూనే ఏడిపిస్తున్న ‘మార్టిన్ లూథర్ కింగ్’.. ట్రైలర్ చూశారా?

Martin Luther King

Martin Luther King

Martin Luther King Trailer Review: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న “మార్టిన్ లూథర్ కింగ్” సినిమాను మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి నటీనటులు నటించగా ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన ముఖ్యపాత్ర పోషించడం మరో విశేషం. వినోద ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ పొలిటికల్ సెటైరికల్ మూవీ తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ క్రమంలో ‘మార్టిన్ లూథర్ కింగ్’ ట్రైలర్ ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు.

Allu Arjun: వీడు ఎక్కడున్నా పుష్ప ‘రాజే’రా

కనీసం తన పేరేంటో కూడా తెలియని చెప్పులు కుట్టే వ్యక్తిగా సంపూర్ణేష్ బాబు పాత్రను పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవగా అతనికి ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే పేరు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు రావడంతో నరేష్, వెంకటేష్ మహా ఎలాగైనా గెలవాలని ఒకరితో ఒకరు పోటీ పడతారు. గెలుపుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న క్రమంలో గెలుపుని నిర్ణయించే ఒక్క ఓటు మార్టిన్ లూథర్ కింగ్(సంపూర్ణేష్ బాబు)ది కావడంతో.. ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. ఓటు విలువ తెలియని చేస్తూ వినోదభరితంగా సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. వాడుకోవడం చేతకానప్పుడు స్వతంత్రం ఉంటే ఎంత లేకపోతే ఎంత?” వంటి డైలాగులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Exit mobile version