టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సమ్మతమే’. గోపినాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కంకణాల ప్రవీణ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ” కృష్ణ అనే ఒక యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గ వర్క్ చేస్తుంటాడు. అతడికి పెళ్ళికి ప్రేమ అనేదానిమీద నమ్మకం ఉండదు. దీంతో ఎంతోమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో తనదగ్గరకు వచ్చినా కాదంటాడు. ఆ సమయంలో హీరోయిన్ ఎంటర్ అవుతుంది. ఆమెతో పరిచయం, స్నేహం వరకు దారి తీస్తుంది. ఆ స్నేహం, ప్రేమ అనే విషయం కృష్ణ కు తెలియడానికి చాలా టైమ్ పడుతుంది.
పెళ్ళికి ముందు ప్రేమంటే నాకు పడదు.. అందులో నేను పడను అంటూనే ప్రేమలో పడిన యువకుడు.. చివరికి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకున్నాడా..? వారి ప్రేమకు వచ్చిన ఇబ్బందులు ఏంటి..? అనేది కథగా తెలుస్తుంది. ఇక కృష్ణ అనే యువకుడు పాత్రలో కిరణ్ నటించాడు అనడం కన్నా జీవించేశాడు అని చెప్పాలి. ఇక చాందిని తన అందంతోనే కాదు తన అభినయంతో కూడా అక్కట్టుకొనేలా ఉంది. టీజర్ లో శేఖర్ చంద్ర ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లజెంట్ గా అలరించింది. మొత్తని టీజర్ ప్రేక్షకులకు ‘సమ్మతమే’ అనిపించేలా ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో ఈ యంగ్ హీరో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
